పశువులకు గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలు వేయించాలి
బేల,(విజయక్రాంతి): పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పక వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు డాక్టర్ రామారావ్ అన్నారు. బుధవారం బేల మండల కేంద్రంలో చేపట్టిన ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పశువులకు గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలు వేసారు.
అనంతరం రామారావు మాట్లాడుతూ... రైతులకు ఆర్థికంగా నష్టం చేసే వ్యాధులలో ముఖ్యమైన వ్యాధి గాలికుంటు వ్యాధి అన్నారు. ఈ వ్యాధి వస్తే పాడి పశువులకు అబార్షన్ అయ్యే అవకాశం ఉందని, పాడి పశువులు అధిక జ్వరంతో బాధపడుతూ, ఎద్దులు దుక్కి దున్నే సామర్థ్యాన్ని కోల్పోతాయన్నారు. ఈ వ్యాధి నివారణ టీకాలతో పశువులు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పశు వైద్యాధికారి, గోపాలమిత్రలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.




