22 May, 2026 | 1:35 AM

ఖాళీలను త్వరగా భర్తీ చేయండి

07-02-2026 01:04 AM

రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఐజీకి టీఎన్జీవో నేత వినతి

హైదరాబాద్, ఫిబ్రవరి ౬(విజయక్రాంతి) : టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ ఎం హుస్సేనీ (ముజీబ్) శుక్రవారం రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఇన్స్‌పెక్టర్ జనరల్ రాజీవ్ హనుమంతు, ఐఏఎస్‌ని కలిశారు. అన్ని కేడర్లలో ముఖ్యంగా గ్రేట్ 2 సీని యర్లకు ప్రమోషన్లకు సంబంధించి వినతిపత్రం సమర్పించారు.

అన్ని ఖాళీలను త్వర గా భర్తీ చేయాలని, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను, రెగ్యులర్ ఉద్యోగులను బదిలీలను త్వరితగతిన నిర్వహించాలని ఐజీని కోరారు. పై అంశాలపై ఐజీ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో కేంద్ర సంఘం అసో సియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్, హైదరాబాద్ సిటీ అధ్యక్షులుశ్రీకాంత్ పాల్గొన్నారు.