17 July, 2026 | 2:59 AM

కాయగూరలు పండిద్దాం

17-07-2026 02:44 AM

స్వయం సహాయ సంఘాల ద్వారా పంట మార్పిడి  

మహబూబాబాద్, జూలై 16 (విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితుల్లో కాయగూరల పంటల సాగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఇందులో మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామని జిల్లా ఉద్యాన శాఖ అధికారి మరియన్న తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లోని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఆరుతడి పంటలు, కూరగాయ పంటలు సాగు చేయాలని డీ హెచ్ వో రైతులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్, పండ్ల తోటల్లో అంతర పంటలుగా, ఎత్తు మడులు, పందిరి సాగు, ట్రెల్లిస్ సాగు, మల్చింగ్, బిందు సేద్య, సేంద్రీయ, ప్రకృతి సేద్యం మొదలైన మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు తెలిపారు. రైతులు పంట మార్పిడి వైపు అడుగులు వేయాలని, ప్రభుత్వ రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఉద్యాన అధికారులు శాంతి ప్రియ, శాంతి ప్రియదర్శిని, ఫీల్ అధికారి శ్రీకాంత్, కార్యాలయ సిబ్బంది జ్యోస్న, కిషోర్, కరుణాకర్, రామకృష్ణ, సుమతి, అరుణ, సుకన్య, రైతులు పాల్గొన్నారు.