22 May, 2026 | 1:37 AM

మెట్‌పల్లిలో పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ధర్నా

22-05-2026 12:30 AM

మెట్ పల్లి, మే 21(విజయక్రాంతి):కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలకు నిరసనగా గురువారం కాంగ్రెస్ శ్రేణులు పట్టణంలోని ఆర్డివో కార్యాలయం ముందు ధర్నాకు దిగి కార్యాలయం లో వినతి పత్రం సమర్పించారు.అనంతరం మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్ ధరలతో అన్ని ధరలు పెరుగుతాయని ప్రజలకు భారం పడుతుందని పేర్కొన్నారు.వెంటనే పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆర్డివో వినతిపత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు.

పెట్రోల్ పెంపు ధరల వల్ల అన్ని రంగాలపై ధరలు పెంచడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు పేద మధ్యతరగతి కుటుంబాలపై భారం పడకూడదని ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న ఆయిల్ కంపెనీ లకు ఆయిల్ బాండ్ల ద్వారా డబ్బులు చెల్లించి అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర ఎంత పెరిగిన ప్రజలపై ప్రభావం ఉండేది కాదని అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధర తగ్గించాలని డిమాండ్ చేశారు .

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు రైసోద్దీన్, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, కౌన్సిలర్ బత్తుల నరేష్, కో ఆప్షన్ మాధవరెడ్డి,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ యమ రాజయ్య,మైలారపు రాంబాబు,పుల్లూరి వెంకటేష్, సురేష్, ద్యావనపల్లి రాజారాం,మన్నే గంగాధర్, యూత్ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్, రాజగౌడ్,గుండు గోపాల్, పిప్పిర రాజేష్,రాజారెడ్డి, నాగభూషణం,రాజగోపాల్, ముఖిమ్,జాకీర్, నజీమ్, పసిభగ్, సాము, వసీం, ముజ్జు, కాసిఫ్ తదితరులు పాల్గొన్నారు.