22 May, 2026 | 1:39 AM

సీఎం సహాయ నిధి పేదలకు వరం

22-05-2026 12:06 AM

చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీంభరత్

మొయినాబాద్, మే 2౧ (విజయక్రాంతి): సీఎం సహాయ నిధి పేద మరియు మధ్యతరగతి ప్రజలకు వరంలా మారిందని చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీంభరత్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను గురువారం మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్లో ఉన్న తన కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలు వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. అలాంటి వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతోందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పేదల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన అన్నారు. 

రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాణయ్య, కంజర్ల భాస్కర్, భద్రప్ప, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, నాగిరెడ్డిగూడ సర్పంచ్ పద్మ సంజీవరెడ్డి, మోత్కుపల్లి సర్పంచ్ సంపూర్ణ రాములు, గణేష్ గౌడ్, మినాజుద్దీన్, సుధాకర్ గౌడ్, మల్లేష్, దయానంద గౌడ్, చిలుకూరు ఆండ్రూ, కౌన్సిలర్ విక్రంరెడ్డి, బాకారం మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డి, బిక్షపతి, గన్నేపాక నర్సింగ్రావు, చిలుకూరు రాజు, వివిధ మండలాలు, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.