22 May, 2026 | 12:48 AM

రైతులకు నిత్యం మజ్జిగ, నీళ్ల పంపిణీ

22-05-2026 12:03 AM

ఆమనగల్లు, మే21, (విజయక్రాంతి): రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఆమనగల్లు మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చి ధాన్యాన్ని అమ్ముకోవచ్చని డిసిసిబి డైరెక్టర్, ఆమనగల్లు సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా కోరారు.

గురువారం మార్కెట్ యార్డు ఆవరణలో వరి ధాన్యం అమ్మేందుకు వచ్చిన రైతన్నల కోసం గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచినీళ్ల బాటిళ్లు, మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు గంప వెంకటేష్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులెవ్వరు అధైర్య పడొద్దు చివరి గింజ వరకు వరి ధాన్యాన్ని కొనుగోలుకు ప్రాథమిక సహకార సిబ్బంది సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు. రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని, దీనితోపాటు సన్న రకం వడ్లకు రూ. 500 బోనస్ ప్రభుత్వం చెల్లిస్తుందని ఆయన వివరించారు.

మార్కెట్ యార్డ్ ఆవరణలో రైతుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని మరోసారి ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో వైస్ ఛైర్మెన్ దో నాదుల సత్యం, ఆమనగల్లు మున్సిపాలిటీ కౌన్సిలర్లు పాపిశెట్టి రాము, దుడ్డు ఆంజనేయులు, ఎనుముల రమేష్, ఎంగలి భాగ్యలక్ష్మి రఘు, నాగిళ్ల జగన్, అనూష శ్రీశైలం, రామ్ నుంతల సర్పంచ్ శ్రీను నాయక్, మాజీ ఎంపీటీసీ లచ్చిరాం నాయక్, బిఆర్‌ఎస్ నాయకులు సయ్యద్ ఖలీల్, సైదులు గౌడ్, పాండు, వేణు, ఏఈవోలు మీనాక్షి భూదేవి, సింగల్ విండో సీఈఓ లు పద్మాకర్ రెడ్డి దేవేందర్ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.