22 May, 2026 | 2:40 AM

రోగులకు పండ్లు పంపిణీ

22-05-2026 01:38 AM

నిజాంసాగర్, మే 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజాపండరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. క్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్. సర్పంచుల ఫోరం అధ్యక్షులు సంకు లక్ష్మయ్య, సర్పంచులు వడ్ల బ్రహ్మం, నందస్మోహన్, పోచయ్య, బొజ్జ అంజయ్య, నాయకులు జనార్దన్ రెడ్డి, సలీం, గౌస్ పటేల్, రాము రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.

నెహ్రూ చౌరస్తా వద్ద ..

గాంధారి, మే 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో నెహ్రూ చౌరస్తా వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సింగసాని శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తూర్పు రాజులు, సొసైటీ డైరెక్టర్ తాడ్వాయి సంతోష్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు బిస గణేష్,  మాజీ జడ్పీటీసీ శంకర్ నాయక్, బొమ్మని బాలయ్య, లైన్ రమేష్, సంగని బాబా, సర్దార్ సింగ్, గడ శంకర్, ముకుంద రావు, మదర్, గాండ్ల లక్ష్మణ్, సంగా గౌడ్, ఈశ్వర్ గౌడ్ , వినయ్ కుమార్,పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.