22 May, 2026 | 2:38 AM

కంటైనర్‌లో భారీగా మంటలు

22-05-2026 12:06 AM
  1. దగ్ధమైన ఎనిమిది కొత్త కార్లు 
  2. మెదక్ జిల్లా 44వ జాతీయ రహదారిపై ఘటన
  3. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం

తూప్రాన్, మే 21(విజయక్రాంతి): నాగపూర్ నుంచి కాకినాడ వైపు వెళ్తున్న కార్ల ట్రక్కు అగ్ని ప్రమాదానికి గురైన ఘటన గురువారం మెదక్ జిల్లా తూప్రా న్ బయ్యర్ కంపెనీ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై చోటుచేసుకుంది. నాగపూర్ నుంచి కాకినాడ వైపు వెళ్తు న్న ట్రక్కులో మారుతి కంపెనీకి సంబంధించిన ఎనిమిది వాగనార్, షిఫ్టు కార్లు భారీ వేడిమితో షార్ట్ సర్క్యూట్ ద్వారా జాతీయ రహదారి 44 బయ్యర్ కంపెనీ సమీపంలో బ్రిడ్జి పైన భారీ అగ్ని ప్రమా దానికి గురై పూర్తిగా కాలిపోయా యి.

స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచా రం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కానీ అప్పటికే కంటైనర్, కార్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమా దం కారణంగా ఈ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరా యం కలిగింది. తూ ప్రాన్ ఎస్‌ఐ గంగరాజు పోలీస్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ట్రాఫిక్ సజావుగా కొనసాగేటట్టు చూశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.