30 August, 2026 | 10:38 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

మట్టి మాఫియాకు కేరాఫ్ అడ్రస్ బీఆర్‌ఎస్ పార్టీ

22-05-2026 12:38 AM

కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్

గంగాధర్, మే 21 (విజయ క్రాంతి): రాష్ట్రంలో మట్టి మాఫియాకు కేరాఫ్ అడ్రస్ బిఆర్‌ఎస్ పార్టీ అని, బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో మట్టి మాఫియా చెరువులను విధ్వంసానికి  గురిచేసిందని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్ అన్నారు. గురువారం గంగాధర ప్రజా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మట్టి తరలింపు పై మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడడం దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందని, బిఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో అప్పటి ఎమ్మెల్యేలు బొడిగె శోభ, సుంకే రవిశంకర్ లు చెరువు మట్టి అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. మరోసారి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య, మాజీ జెడ్పిటిసి సభ్యుడు సత్తు కనుకయ్య, సర్పంచులు వేముల భాస్కర్, దాసరి శంకరయ్య, కాంగ్రెస్ నాయకులు కొలిపాక స్వామి, పడాల రాజన్న, కర్ర విద్యాసాగర్ రెడ్డి, రేండ్ల రాజిరెడ్డి,గునుకొండ బాబు, అట్లా శేఖర్ రెడ్డి,ఆరే రాజశేఖర్, దీకొండ మధు, గుడి ప్రవీణ్ రెడ్డి, మోహన్ రెడ్డి, మంత్రి మహేందర్, తదితరులు పాల్గొన్నారు.