ఘనంగా బోరంచ పోచమ్మ జాతర
పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్, ఏప్రిల్ 23: జిల్లాలో ప్రసిద్ధి చెందిన మనూరు మండలంలోని బోరంచ పోచమ్మ తల్లి ఏడువారాల జాతర ఉత్సవాలు గురువారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి, ఆలయ ఈవో శివ రుద్రప్ప, ఆలయ కమిటీ చైర్మన్ బెల్లపురం మల్లన్న హాజరై ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతర ఉత్సవాల సందర్భంగా స్థానిక పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగ కుండా అన్ని రకాల వసతి చర్యలను చేపట్టినట్లు తెలిపారు. ప్రతి గురువారం ప్రత్యేక హెల్త్ క్యాంపును చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. జాతర ఉత్సవాలు జూన్ 4వ తేదీ వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎస్త్స్ర కోటేశ్వరరావు, సర్పంచ్ బీరప్ప, ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు పాల్గొన్నారు.






