15 July, 2026 | 1:59 AM

ఎల్లారెడ్డిలోని మైనార్టీ కళాశాల తరలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు

15-07-2026 01:59 AM

ఎల్లారెడ్డి, జులై 14(విజయ క్రాంతి) : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మైనారిటీ వెల్ఫేర్ కళాశాలను ఇటీవల లింగంపేట్ మండల కేంద్రానికి తరలించడంపై బారాస నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కళాశాల తరలింపు పై స్థానిక బారాస నాయకులు ఆర్డీవో కు వినతి పత్రాన్ని అందించారు . ఈ సందర్భంగా బారాస పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్ మాట్లాడుతూ గత బారాస ప్రభుత్వంలో పేదల నాణ్యమైన విద్య కోసం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో రకాల విద్యాసంస్థలను మంజూరు చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు

దీనిలో భాగంగానే ఎల్లారెడ్డి మండల కేంద్రానికి మైనారిటీ వెల్ఫేర్ కళాశాలను మంజూరు చేశారు అప్పటి మాజీ శాసనసభ్యులు సురేందర్ గారు ఈ విద్యాసంస్థపై ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడి మంజూరు చేశారని ఆయన అన్నారు కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల దాటి నందున కాంగ్రెస్ పరిపాలన విచిత్రంగా ఉందని ఆయన ఎద్దేవ చేశారు ఏ నియోజకవర్గానికైనా అభివృద్ధి పథంలో భాగంగా కొత్త కొత్త ప్రభుత్వ ప్రైవేటు సంస్థలను మంజూరు చేస్తారు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న సంస్థలను బదిలీ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారు చొరవ తీసుకొని బదిలీ అయిన మైనారిటీ కళాశాలను మళ్లీ యధా స్థలానికి తీసుకురావాలని వచ్చేట్లు కృషి చేయాలని ఆయన కోరారు లేనియెడల భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఆయన అన్నారు

గతంలో తుమ్మెద శివారులో అప్పటి ముఖ్య మంత్రి కేసీఆర్ గారు పాలిటెక్నిక్ వ్యవసాయ కళాశాలను మంజూరు చేశారు కానీ ఈ ప్రభుత్వం రాగానే ఆ కళాశాలను సైతం సిద్దిపేట ప్రాంతానికి తరలించారు ప్రస్తుత పరిపాలనలో ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పుకోవడం తప్ప ఉన్న అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా పాలకులు అధికారులు జోక్యం చేసుకొని తరలి వెళ్లిన పాలిటెక్నిక్ వ్యవసాయ కళాశాలతో పాటు మైనార్టీ వెల్ఫేర్ కళాశాలను మళ్లీ యద స్థలాలకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం స్థానిక ఆర్డిఓ ప్రభాకర్ గారికి వినతి పత్రాన్ని అందించారు.  ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షులు ఏగుల నర్సింలు నాయకులు గంగారెడ్డి బర్కత్ అమీర్ ఇమ్రాన్ శ్రవణ్ అరవింద్ గౌడ్ దయాకర్ బబ్లు దేవదాస్ నారాయణ యూనుస్ తో పాటు  పాల్గొన్నారు.