15 July, 2026 | 2:00 AM

2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి

15-07-2026 02:00 AM

కామారెడ్డి, జూలై 14 (విజయక్రాంతి): తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టి పి టి ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ని మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరారు, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, నూతన ఆరోగ్య పథకం మార్గదర్శకాలను రూపొందించి ఉద్యోగులకు వెంటనే హెల్త్ కార్డుల ను విడుదల చేయాలని అన్నారు.

పిఆర్సినీ ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని కోరారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ ను రూపొందించాలని , మోడల్ స్కూల్,గురుకుల, కేజీబీవీ లను విద్యాశాఖలో విలీనం చేసి, టీచర్లకు నూతన ఆరోగ్య పథకం వర్తింపజేయాలని అన్నారు, ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న పండిట్, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి ప్రమోషన్లు కల్పించాలని కోరారు,  ప్రాతినిధ్యం చేసిన వారిలో టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల  అనిల్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు యం. లక్ష్మయ్య యాదవ్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల బాలయ్య లు పాల్గొన్నారు.