24 April, 2026 | 2:43 AM

జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ధర్నా

24-04-2026 01:21 AM

బిచ్కుంద, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): బిచ్కుంద మండల పరిధిలో రైతులు పెద్ద మొత్తంలో అరుతడి పంటలైన జొన్న మొక్కజొన్న పంటలను పండిస్తున్న తరుణంలో పంట కోశ కోత దశకు వచ్చి నూర్పు వెళ్ళు సైతం జరిగిపోయిన ఇప్పటివరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక తమ పంటలను గిట్టుబాటు ధరలకు అమ్ముకోలేని స్థితిలో ఉన్నామని ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలంటూ బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం

ముందు BKS భారతీయ కిసాన్ సంఘ్ అద్వర్యం లో  ఆందోళనకు దిగారు. ఈ రోజు బిచ్కుంద MRO ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ  జోన్న, మొకజోన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని E కార్యక్రమం తాసిల్దార్ వేణుగోపాల్ కు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో రైతులు హన్మారెడ్డి, ఆనాధ్ పటేల్ మాశెట్టి రాజు పటేల్ తదితరులతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.