17 August, 2026 | 3:14 PM

Districts - Sangareddy

article_42525094.webp
హెచ్‌ఎం పోస్టు భర్తీకి ప్రజావాణిలో ఫిర్యాదు

నాగల్‌గిద్ద, ఆగస్టు 17,(విజయక్రాంతి): నాగల్‌గిద్ద జడ్పీ ఉన్నత పాఠశాలలో రెగ్యులర్ హెచ్‌ఎం పోస్టు ఖాళీగా ఉండటంతో పాఠశాల నిర్వహణ, విద్యార్థుల విద్యాభ్యాసంపై ప్రభావం పడుతోందని కేవీపీఎస్ జిల్లా నాయకుడు గణపతి అన్నారు. ఈ సమస్యపై సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేసి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం హెచ్‌ఎంగా పనిచేస్తున్న అధికారి జిల్లా సైన్స్ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పాఠశాలపై పూర్తిస్థాయిలో దృష్టి, పర్యవేక్షణ లేకపోతోందని ఆరోపించారు. హెచ్‌ఎం అందుబాటులో లేకపోవడంతో పాఠశాల పరిపాలనతో పాటు విద్యార్థుల విద్యా కార్యక్రమాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

17-08-2026

article_38535924.webp
సీఎం కు ఘన స్వాగతం

పటాన్ చెరు: సంగారెడ్డి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డికి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ ఘన స్వాగతం పలికారు. కంది ఐ ఐ టి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం కి నీలం మధు పుష్పగుచ్ఛం అందించి, సాదరంగా ఆహ్వానించారు. మంత్రులు, ముఖ్య కాంగ్రెస్ నేతలతో కలిసి వచ్చిన నీలం మధు ముదిరాజ్ సీఎం కి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి సంగారెడ్డి ఐ బీ గెస్ట్ హౌస్ వద్ద జగ్గారెడ్డి, నిర్మలా జగ్గా రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జవహర్ లాల్ నెహ్రు, రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్, మంత్రులతో కలిసి పాల్గొన్నారు.

16-08-2026

article_65816809.webp
అసమానతల నిర్మూలనే అసలైన స్వేచ్ఛ

పటాన్ చెరు, ఆగస్టు 15: దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు పూర్తిగా తొలగిపోయినప్పుడే భారత్ నిజమైన ప్రగతి బాటలో పయనిస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ తెలిపారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్‌లోని ఎస్సీ కాలనీ, మాల బస్తి, అంగన్వాడి కేంద్రం, దుర్గమ్మ గుడి సమీపం, ముదిరాజ్ కాలనీ, గొల్ల కురుమ యాదవ సంఘం, వార్డు కార్యాలయం, పల్లె దవకాన, చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద, పలు కాలనీలలోని జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, స్థానిక ఎన్.ఎం.ఆర్ క్యాంపు కార్యాలయంలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.

15-08-2026

article_64581612.webp
గీతంలో ఉత్సాహంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పటాన్ చెరు, ఆగస్టు 15: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని గాంధీజీ విగ్రహం వద్ద 80 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశభక్తితో, ఉత్సాహంగా, ఉద్వేగంతో జరుపుకున్నారు. ఈ వేడుకలు దేశానికి, దాని గొప్ప స్వేచ్ఛా వారసత్వానికి ఉత్సాహభరితమైన నివాళిగా విద్యార్థులు, ఉన్నతాధికారులు,అధ్యాపకులు, సిబ్బందిని ఒకచోట చేర్చాయి. ‘వందేమాతరం’ జాతీయ గీతం ఆలపించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ‘జన గణ మన’ జాతీయ గీతాన్ని ఆలపించారు. గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సభికులను ఉద్దేశించి ప్రసంగించారు.

15-08-2026

article_65245112.webp
అమీన్‌పూర్‌లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

అమీన్‌పూర్, ఆగస్టు 15: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా మరియు దేశభక్తి భావనలతో నిండిన వాతావరణంలో జరిగాయి. ఇందులో భాగంగా అమీన్‌పూర్ జీహెచ్ఎంసి కార్యాలయంలో నిర్వహించిన అధికారిక వేడుకల్లో డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్‌తో కలిసి అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీరంగూడ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఏర్పాటుచేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. వివిధ కాలనీల్లో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి, వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

15-08-2026

article_28294968.webp
కలెక్టరేట్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి, ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ సముదాయంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ సముదాయ ఆవరణలో జిల్లా అదనపు కలెక్టర్‌ సంగీత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ సంగీత మాట్లాడుతూ, ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నామని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు.

15-08-2026

article_67716566.webp
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి, ఆగస్టు 15: నెహ్రూ, ఇందిరమ్మ అందించిన సంక్షేమ స్ఫూర్తితో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

15-08-2026

article_85186869.webp
ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

రామచంద్రపురం ఆగస్టు 15: రామచంద్రాపురం 268వ డివిజన్‌లో బీజేపీ డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రామచంద్రాపురం 268వ డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, పద్మావతి, బసమ్మ, సంతోషి, రవి యాదవ్, శ్రీశైలం, తోపా రాజు తదితరులు పాల్గొన్నారు.

15-08-2026

article_20158081.webp
బచ్పన్ స్కూలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు

అమీన్ పూర్, ఆగస్టు 15: బచ్పన్ AHPS ప్రైమరీ, బీరంగూడలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ఉత్సాహభరితంగా దేశభక్తి వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్లు సి.హెచ్. శ్రీనివాసరావు, ఆర్.శిరిషారెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ రాఘవేంద్ర సమక్షంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకలు విద్యార్థుల అద్భుతమైన మార్చ్పాస్ట్తో ప్రారంభమయ్యాయి. చిన్నారులు అతిథులను ఘనంగా ఆహ్వానించారు. అనంతరం మూడవ తరగతి విద్యార్థులు దేశభక్తి నృత్యాలను ఆకర్షణీయంగా ప్రదర్శించి దేశప్రేమ సందేశాన్ని చాటిచెప్పారు.

15-08-2026