సీఎం సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన బిజెపి నాయకులు
09-05-2026 06:35 PM
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలం చందాయిపేట్ గ్రామంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆదేశానుసారం గ్రామానికి చెందిన బండ రాజు కు సీఎంఆర్ఎఫ్ చెక్కును శనివారం బిజెపి నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల బిజెపి ప్రధాన కార్యదర్శి జూకంటి శోభన్, బూత్ బిజెపి అధ్యక్షుడు బుడ్డ రమేష్, ప్రధాన కార్యదర్శి శిలబలిష్, మాజీ బూత్ అధ్యక్షుడు వంశీ గౌడ్, ఉపాధ్యక్షుడు శాలిపేట స్వామి, సంఘని రాజు తదితరులు పాల్గొన్నారు.






