18 March, 2026 | 11:13 PM

బీఆర్ఎస్ సర్పంచ్ భర్తపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలి

18-03-2026 09:41 PM

రాష్ట్ర ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు గిరిజన విద్యార్ధి సంఘాల నేతలు 

అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం అంకిరోనిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ కమల భర్త సతీషా నాయక్ పై దాడిచేసిన కాంగ్రేస్ అచ్చంపేట మండలాధ్యాక్షులు దొడ్ల నర్సయ్య యాదవ్ తో పాటు అతని అనుచరులు దొడ్ల వినోద్, దొడ్ల రామకృష్ణ, దొడ్ల పద్మలను అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని గిరిజన విద్యార్ధి సంఘాల జెఏసీ నేతలు డిమాండ్ బుధవారం చేశారు.

బషీర్ బాగ్ లోని తెలంగాణ రాష్ట్ర ఎస్టీ కమిషన్ కార్యాల యాన్ని సందర్శించి సభ్యులు కె.రాంబాబునాయక్ ను కలిసి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గ్రామంలో ప్రభుత్వ భూమిలో ఆక్రమంగా నిర్మించుకున్న ఇండ్ల యాజమానులకు సర్పంచ్ నోటిస్లు జారి చేయగా హైద్రాబాద్లోని ఓయు ఆర్ట్స్ కాలేజి ప్రాంగణంలో జరిగిన మిడియా సమావేశంలో బీఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు, గిరిజన చైతన్య వేధిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజు నాయక్ మాట్లాడుతూ గ్రామంలోని ఆటో స్టాండ్ దగ్గర సతీష్ తన పనినిమ్మితం నిలబడి వుంటే అక్రమ నిర్మాణాలకు నోటిసులు ఎలా ఇప్పిస్తావని సంబందం లేని విషయాలు తీసుకవచ్చి కల్పించుకోని కులంపేరుతో తీవ్రంగా దూషిస్తు రాళ్లతో, కర్రలతో దాడి చేశారు.

వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆకారణంగా గిరిజన సర్పంచ్ కమల కుటుంబ సభ్యులపై దాడిచేసిన కాంగ్రేస్ మండలాధ్యక్షులు దొడ్ల నర్సయ్యతో పాటు అతని అనుచరులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు కొర్ర శరత్ నాయక్.లైవ్ విద్యార్ధి విభాగం రాష్ట్ర కార్యదర్శి. రాజేష్ నాయక్. నరేస్నాయక్,గిరిదర్నాయ.క్ నేతలు నాయక్ డిమాండ్ చేశారు.