శివంపేట మండల ప్రజలకు పరా బావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
18-03-2026 09:36 PM
తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా!!
శివంపేట్,(విజయక్రాంతి): శివంపేట మండలంలోని వివిధ గ్రామాల కుటుంబ సభ్యులకు, మిత్రులకు శ్రేయోభిలాషులకు శివంపేట మండల ఆపద్బాంధవుడు సంఘ సేవకులు తాజా మాజీ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా తెలుగు సంవత్సర శ్రీ పరా బావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ మీ కుటుంబాలలో ఆర్థిక ఆరోగ్య సంతోషాలను నిలపాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అని అన్నారు. 60 ఏళ్ల కాలచక్రంలో పరాభవ 40వ సంవత్సరమని పరాబావ అంటే మనలోని అహంకారాన్ని చెడు ఆలోచనలను ఓడించి విజయానికి పునాది వేసేది అని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు విజయాలు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.




