పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!
పరిస్థితి విషమం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలింపు.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) తెలకపల్లి మండలం బొప్పల్లి గ్రామంలో పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. గ్రామంలోకి దూసుకొచ్చిన కుక్క చిన్నారులు, మహిళలు, వృద్ధులు సహా సుమారు 10 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. గాయపడిన వారిని స్థానికులు వెంటనే తెలకపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ప్రథమ చికిత్సతో పాటు రేబీస్ వ్యాక్సిన్ అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం 108సాయంతో నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో బొడ్డుపల్లి వెంకటేష్, సల్వది వర్షిణి, కాశమ్మ ఇటిక్యాల నిశ్వoత్, గౌరరం సైదులు, నేరేడి నవ్యశ్రీ, అల్వల యశ్వంత్, శేఖర్ తో పాటు మరికొంత మంది ఉన్నారు. గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు, గ్రామస్తులు కోరుతున్నారు.
02-07-2026