calender_icon.png 4 February, 2026 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Editorial

article_67611957.webp
ప్రజాకాంక్షకు అద్దం పట్టాలి!

01-02-2026

బడ్జెట్ అంటే అంకెల సమాహారం కాదు.. దేశ ప్రజల ఆకాంక్షల వ్యక్తీకరణ. ఒకప్పుడు 375 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభమైన గణతంత్ర భారత బడ్జెట్ 50 లక్షల కోట్ల రూ పాయలకు పెరిగినా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోవటం వల్ల బడ్జెట్‌లపై ప్రజలకి నమ్మకం సన్నగిల్లుతుంది. అంతర్జాతీ యంగా ఎదురవుతున్న సవాళ్లు ముఖ్యం గా అమెరికాతో వాణిజ్య చర్చల్లో ఏర్పడిన ప్రతిష్ఠంభన, ట్రంప్ సుంకాల పెంపు, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం, యూరోపియన్ యూనియన్‌తో కుదిరిన అతిపెద్ద స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ప్రవేశపెడుతున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.