calender_icon.png 4 February, 2026 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ నేతల ఉచ్చులో పడొద్దు

04-02-2026 02:27:29 PM

హైదరాబాద్: మతం పేరుతో చేసే రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. బీజేపీ నేతలు మతం పేరుతో రెచ్చగొడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెచ్చిన బిల్లులను ఎందుకు ఆమోదించలేదో బీజేపీ నేతలు(BJP leaders) చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధిహామీ పథకానికి నిధులు ఎందుకు కోత పెట్టారో బీజేపీ చెప్పాలన్నారు. మన్ రేగా నుంచి గాంధీజీ పేరు ఎందుకు తొలగించారో బీజేపీ చెప్పాలన్నారు.

జీఎస్టీలో మార్పు వల్ల రాష్ట్రం రూ.7 వేల కోట్ల ఆదాయం కోల్పోయిందని తెలిపారు. దేవుళ్ల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతల ఉచ్చులో పడొద్దని మహేశ్ గౌడ్ తెలంగాణ ప్రజలకు(Telangana people) విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కిషన్ రెడ్డి ఏ రోజూ స్పందించలేదని ఆరోపించారు. ''కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాభివృద్ధి మాత్రమే ముఖ్యం.. మత రాజకీయం మేం చేయం'' అని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులు.. కులమత రాజకీయాల ఉచ్చులో పడరని తెలిపారు. కేంద్ర బడ్జెట్(Union Budget)లో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్ స్టీన్ ఫైల్స్ లో ప్రధాని మోదీ పేరు వినిపిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఆరోపించారు.