calender_icon.png 4 February, 2026 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీకృష్ణ కమిటీకి 16 ఏళ్లు

03-02-2026 12:00:00 AM

తెలంగాణ ఏర్పాటుపై విస్తతమైన శ్రీకృష్ణ కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటైం. కమిటీ కార్యదర్శిగా వినోద్ కుమార్ దుగ్గల్ వ్యవహరించారు. రవీందర్ కౌర్, రణబీర్ సింగ్, అబూ సలేహ్ షరీఫ్ సభ్యులుగా సేవలందించారు. వీరంతా అనేక రంగాల్లో నిష్ణాతులు. కమిటీ సభ్యులు సుమారు పది నెలల పాటు అధ్యయనం చేసింది. తద్వారా ఇదే ఏడాది డిసెంబర్ 30న కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది.  కమిటీ ప్రధానంగా ఆరు ప్రధాన ప్రతిపాదనలను సూచించింది.

వీటిలో మొదటిది ఉమ్మడి ఆంధ్రా యథాతథ స్థితిని కొనసాగించడం. అంటే రాష్ట్రాన్ని విభజించకుండా అలాగే ఉంచడం. రెండోది రాష్ట్రాన్ని రెండుగా విభజించి తెలంగాణ, సీమాంధ్రలుగా మార్చడం, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలి. మూడోది హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేస్తూ రాష్ట్రాన్ని విభజించడం. నాలుగో ప్రతిపాదన సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలిపి ఉంచుతూనే తెలంగాణకు ప్రత్యేక అభివద్ధి మండలి వంటి స్వయంప్రతిపత్తి కల్పించడం. ఐదోది రాష్ట్రాన్ని రెండుగా విభజించి హైదరాబాద్‌ను తెలంగాణకు రాజధానిగా ఇవ్వడం.

ఇక ఆరోది రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతూనే తెలంగాణ ప్రాంత సామాజిక, రాజకీయ, ఆర్థిక అభివద్ధి కోసం ‘తెలంగాణ ప్రాంతీయ మండలి’ వంటి రాజ్యాంగబద్ధమైన అధికారాలు గల సంస్థను ఏర్పాటు చేయడం. ఏదేమైనా కమిటీ ఏర్పాటుతో తెలంగాణ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి. రాజకీయ పక్షాల అభిప్రాయాలను వినడానికి ఒక అధికారిక వేదిక దొరికింది. క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలను తెలుసుకునే అవకాశం కలిగింది. భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక, సామాజిక సమస్యలపై ఒక స్పష్టమైన అంచనా వచ్చింది.

నివేదికలోని గణాంకాలు వెనుకబాటుతనంపై చర్చకు దారితీశాయి. ఇది కేంద్ర ప్రభుత్వానికి నిర్ణయం తీసుకోవడంలో ఒక ప్రాతిపదికగా నిలిచింది. ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యను పరిష్కరించేందుకు ఇదొక ముందడుగుగా నిలిచింది. మరోవైపు ఈ కమిటీ వల్ల తెలంగాణ ఆకాంక్ష నెరవేరడంలో తీవ్ర జాప్యం జరిగిందనే విమర్శలు కూడా వచ్చాయి. నివేదికలోని ఎనిమిదో అధ్యాయం నాడు వివాదాస్పదంగా మారింది.

సీల్డ్ కవర్‌లో ఉంచిన ఆ వివరాలు ఉద్యమకారుల్లో అనుమానాలకు తావిచ్చాయి. ఉమ్మడి రాష్ర్టంగా ఉంచడానికే కమిటీ మొగ్గు చూపడం వల్ల ప్రజల్లో అసహనం పెరిగింది. ఇది కాలయాపన చేసే వ్యూహమని విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజకీయ అనిశ్చితి కొనసాగడానికి ఈ ప్రక్రియ కారణమైంది. చివరకు ఈ నివేదిక తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధతం చేసేలా మార్పు తెచ్చింది.

- రతన్ రుద్ర