18 July, 2026 | 6:05 PM

Breaking News

బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •   సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి   •   విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన మాక్‌ పోలింగ్‌   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ   •   ప్రజలు పరిశుభ్రంగా ఉండాలంటే వ్యర్థ పదార్థాలు వేరు చేయాలి   •  

స్పీకర్ తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టు

04-02-2026 02:04 PM

హైదరాబాద్: అనర్హత పిటిషన్లను తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Telangana Speaker Gaddam Prasad Kumar) కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మండిపడ్డారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు క్లీన్ చీట్ ఇవ్వడం స్పీకర్ పదవికున్న గౌరవాన్ని దెబ్బతీయమేనని ఆరోపించారు. ఎమ్మెల్యే సంజయ్ కు సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ లో చేర్చుకున్నారని కేటీఆర్ వెల్లడించారు.

ఆధారాలు లేవని అనర్హత పిటిషన్ ను స్పీకర్(Telangana Speaker) తిరస్కరించడం అర్థరహితమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు, ప్రజాతీర్పును కాలరాసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని చేతపట్టుకుని తిరగే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదని ఆయన సూచించారు. కాంగ్రెస్ వికృత రాజకీయక్రీడకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

కొనసాగుతున్న ఫిరాయింపుల కేసులలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్(Jagtial MLA Sanjay) బీఆర్ఎస్ నుండి అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని నిరూపించడానికి తగిన సాక్ష్యాలు లేవని పేర్కొంటూ, తెలంగాణ స్పీకర్ ఆయనపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేశారు. ఇప్పటివరకు, ఫిరాయింపుల ఆరోపణల నుండి 10 మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మందికి విముక్తి లభించింది.