04-02-2026 02:30:38 PM
జాజిరెడ్డిగూడెం,(అర్వపల్లి): విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట మండలం కాసరబాద గ్రామానికి చెందిన పంతం నాగరాజు తండ్రి మల్లయ్య(34)అను అవివాహితుడు జాజిరెడ్డిగూడెం మండలం అడివెంల గ్రామానికి చెందిన తన బావ అయిన బొర్ర నాగరాజు వద్ద గత రెండు సంవత్సరాలుగా ఉంటూ గ్రామానికి చెందిన పలువురి రైతుల వద్ద పొలంను కౌలుకు తీసుకుని జీవిస్తున్నాడు.ఈ క్రమంలో వ్యవసాయ మోటర్ వద్ద పశువులు వైర్లు తెంపడంతో వాటిని సరిచేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.