calender_icon.png 4 February, 2026 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యతరగతికి ఏదీ ఉపశమనం?

03-02-2026 12:00:00 AM

కొన్ని బడ్జెట్లు ఎన్నికల లెక్కల్లో గుర్తుండిపోతాయి. మరికొన్ని బడ్జెట్లు దేశ మౌలిక దశను మార్చిన మైలురాళ్లుగా నిలుస్తాయి. మధ్యతరగతికి కాస్త ఉపశమనమిచ్చే భరోసాలు ఉంటా. తాజా కేంద్ర పద్దు మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయ పన్నుల రూపంలో భారం మోస్తూ, వినియోగ వ్యయాల ద్వారా మార్కెట్కు ఊపిరి పోస్తున్న మధ్యతరగతి వర్గాలకు  ఉపశమనమివ్వలేదు.

ఆదాయపు పన్ను స్లాబ్‌ల్లో ఎలాంటి మార్పులు లేకపోవడం, స్టాండర్డ్ డిడక్షన్ పెంపుపై మౌ నం వహించడం వేతన జీవుల నిరాశను పెం చింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పన్ను భారాన్ని సవరించకపోవడంతో వారి చేతిలో మిగిలే ఆదాయం క్ర మంగా తగ్గిపోతోంది. ఇంధనం, ఆహార పదార్థాలు, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక అవసరాలపై ఖర్చులు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిలోనూ మధ్యతరగతిపై పన్ను భారం యథాతథంగా కొనసాగించ డం ఆర్థిక క్రమశిక్షణ పేరిట ఈ వర్గాన్ని మౌనంగా త్యాగం చేయడమేననే భావన బలపడుతోంది.

మధ్యతరగతి కేవలం పన్ను చెల్లింపుదారుల వర్గం మాత్రమే కాదు.. దేశీ య వినియోగ డిమాండ్ ఇంధనం. కార్లు, ఇళ్లు, గృహోపకరణాలు, విద్యా సేవలు వంటి అన్ని రంగాలు వీరి ఖర్చులపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ వర్గం చేతిలో ఆదా యం తగ్గితే వినియోగం క్షీణిస్తుంది. దానివల్ల పరిశ్రమల ఉత్పత్తి మందగించి ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. ఇది ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేసే శృంఖల ప్రభా వం. మధ్యతరగతిని నిర్లక్ష్యం చేయడం తా త్కాలికంగా ప్రభుత్వ ఖజానాకు ఉపశమనమిచ్చినా దీర్ఘకాలంలో వృద్ధి పునాదులను బలహీనపరచే ప్రమాదం ఉంది.

తెలుగు రాష్ట్రాలకు సంతృప్తి లేదు

ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. హైదరాబాద్ కేంద్రంగా హైస్పీడ్ రైల్వే కారిడార్లు, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, ఆంధ్రప్రదేశ్‌లో అరుదైన ఖనిజాల కారిడార్ ప్రతిపాదన వంటివి ప్రాంతీ య ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. ఇవి పరిశ్రమలు, ఉపాధి, మౌలిక వసతుల పరంగా కొత్త అవకాశాలను తెరవగలవు. అయితే రాష్ట్ర విభజన హామీల అమలుపై ఈ బడ్జెట్ స్పష్టత ఇవ్వలేకపోయింది.

తెలంగాణ విషయంలో హైదరాబాద్‌కు ప్రాధాన్యమిచ్చినా వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి లేకపోవడం ప్రాంతీయ అసమానతలకు దారి తీయవచ్చు. స్టాక్ మార్కెట్ విషయంలో సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను పెంపు, కఠిన నియంత్రణా నిబంధనల ప్రతిపాదనలు పెట్టుబడిదారుల్లో ఆందోళనను రేకెత్తించాయి. బ్లాక్ మనీ, అధిక స్పెక్యులేషన్‌ను నియంత్రించాలన్న ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా, ఈ చర్యలు పెట్టుబడుల స్వభావాన్ని సూక్ష్మంగా వేరు చేయకుండా భారంగా మారుతున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు, పెన్షన్ ఫండ్లు ఈ విధానాల వల్ల వెనుకడుగు వేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్న సమయంలో అదనపు పన్ను భారం భారత మార్కెట్ల ఆకర్షణను తగ్గిస్తుంది. 

 ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌ గోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రెడ్ సీ సంక్షో భం, ఇంధన ధరల ఒడిదుడుకులు, అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఘర్షణలు, వాతా వరణ మార్పుల ప్రభావం వంటి సవాళ్ల నడుమ భారత ఆర్థిక వ్యవస్థను స్థిరమైన దారిలో నడిపించాలనే ప్రయ త్నంగా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ౧న తన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ కేవలం వార్షిక ఆదాయ వ్యయాల పట్టిక మాత్రమే కాదు. ఇది దేశ ఆర్థిక దిశను, రాజకీయ సంకల్పాన్ని, సామాజిక ప్రాధాన్యతల ను ప్రతి బింబించే ఒక విధాన పత్రం.

కేంద్రం ఈ పద్దును ‘వికసిత భారత్’ అనే నినాదం తో ప్రవేశపెట్టింది. పద్దులోని రూ.53.5 లక్షల కోట్ల వ్యయం, రూ.12.2 లక్షల కోట్ల మూలధన వ్యయం, 4.3% ఆర్థిక లోటు.. ఇవి అంకెలు కావు. ఇవి ప్రభుత్వ ఆర్థిక త త్వాన్ని ప్రతిబింబించే సంకేతాలు. వికసిత భారత్  దృక్పథాన్ని బడ్జెట్ ద్వారా అర్థం చేసుకోవాలి. ఇది స్వాతంత్య్ర శతాబ్ది నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం కేంద్ర ప్రభుత్వంలో ప్ర స్ఫు టమవుతున్నది.

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు, సరఫరా గొలుసులో ఆటంకాలు ఉన్నప్పటికీ, భారత ఆర్థిక నౌకను సురక్షితం గా, స్థిరమైన వృద్ధి రేటుతో నడిపించే ప్రయ త్నం బడ్జెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ము ఖ్యంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పదే పదే ప్రస్తావించిన‘యువ శక్తి, అన్నదా త, నారీశక్తి, పేదలు అనే నాలుగు స్తంభా ల ఆధారంగా రూపొందించిన ఈ బడ్జెట్, పాపులిజం కంటే పనితీరుకు, స్వల్పకాలిక ఉపశమనం కంటే దీర్ఘకాలిక మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిచ్చింది.

భారత బడ్జెట్ చర్చల్లో తరచూ వినిపించే ఆర్థిక క్రమశిక్షణ అనే పదం వాస్తవంగా ఆచరణలోకి రావడం అరుదు. గత దశాబ్దంలో పాపులిస్ట్ విధానాలు ఆర్థిక లోటును అదుపు తప్పేలా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే 2026- బడ్జెట్‌లో ప్రభుత్వం 2025- 4.4 శాతంగా ఉన్న ఆర్థిక లోటును 4.3 శాతానికి తగ్గించాలనే లక్ష్యం పెట్టుకుం ది.

ఆర్థిక క్రమశిక్షణపై ఇది ఒక ప్రశంసనీయమైన ప్రకటనగా ప్రభుత్వం చెప్పుకుంటున్న ప్పటికీ, ప్రజలకు నేరుగా అందే ప్రయోజనా ల పరంగా అనేక సందేహాలు ఉన్నాయి. భా రీ వ్యయ బడ్జెట్ నేపథ్యంలో ఇది ఆర్థిక నియంత్రణకు నిదర్శనం. ముఖ్యంగా రాబో యే సంవత్సరాల్లో 4 శాతం కంటే తక్కువకు తీసుకురావాలనే సంకల్పం అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు, విదేశీ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచే అంశం.

భారమంతా సామాన్యుడిపైనేనా?

ప్రముఖ దేశాలన్నీ అప్పుల ఊబిలో కూ రుకుపోతున్న సమయంలో భారత్ తన ఆర్థిక వ్యవస్థను నియంత్రిత పథంలో ఉంచ డం చిన్న విషయం కాదు. అయితే, ఈ క్రమశిక్షణ భారమంతా సామాన్యుడి భుజాలపై పడుతుందా.. అన్న అనుమానం కలుగుతోంది. పన్ను ఉపశమనాలు లేకుండా లోటును తగ్గించడం సామాజిక సమతుల్యతకు విఘాతం కలిగించవచ్చు. మూలధన వ్యయంపై ప్రభుత్వం చూపిన పట్టు ఈ బడ్జె ట్లో అత్యంత బలమైన కోణం.

గత ఆర్థిక సం వత్సరంలో రూ.11.21 లక్షల కోట్లుగా ఉ న్న మూల ధన వ్యయాన్ని 2026-27లో రూ.12.2 లక్షల కోట్లకు పెంచడం సుమారు 9 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక శక్తిని నింపే వ్యూ హాత్మక నిర్ణయం. మౌలిక సదుపాయాలపై ఈ పెట్టుబడులు ఉత్పాదకతను పెంచడంతో పాటు దేశాన్ని గ్లోబల్ సరఫరా గొలుసులో బలమైన భాగస్వామిగా నిలబెడతాయి.

ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం, మూలధన వ్య యంలో పెట్టే ప్రతి రూపాయి కనీసం రెండు నుంచి మూడు రెట్ల ఆర్థిక కార్యకలాపాలను సృష్టించే సామ ర్థ్యం కలిగి ఉండటం దీని ప్రాధాన్యతను పెంచుతుంది. ఉపాధి కోణం లో ఈ విధానం అత్యంత కీలకం. నిర్మాణ రంగంలో ప్రత్యక్షంగా లక్షలాది ఉద్యోగాలు సృష్టించడమే కాకుండా వివిధ రంగాల్లో పరోక్ష ఉపాధి అవకాశాలను విస్తరిస్తుంది.

సబ్సిడీల ద్వారా తాత్కాలిక ఉపశమనం ఇవ్వడం కంటే ఉత్పాదక పెట్టుబడుల ద్వారా శాశ్వత ఉపాధిని నిర్మించాలనే ఆలోచన ఈ బడ్జెట్లో ప్రతిఫలిస్తోంది. అయితే, ఈ కేపెక్స్ వ్యయాల అసలై న ప్రయోజనాలు ప్రజల జీవితాల్లో కనిపించాలంటే అమలు వేగం అత్యంత కీలకం. గతంలో అనేక మౌలిక సదుపాయ ప్రాజెక్టులు ఆలస్యమై వ్యయా లు పెరిగి ఆశించిన ఫలితాలు అందించలేకపోయాయి.

ఈసారి ప్రకటనలతో పాటు పారదర్శకత, బాధ్యతాయుత అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రవాణా, మౌలిక వసతులకు రూ. 5.98 లక్షల కోట్లు, రక్షణ రంగానికి రూ. 5.94 లక్షల కోట్లు కేటాయించి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో దేశీయ తయారీకి ప్రాధాన్యతనిచ్చారు. ఈ భారీ కేటాయింపులు పారిశ్రా మిక వృద్ధికి తోడ్పడతాయే తప్ప తక్షణ ఉపాధి కల్పనలో ఎంత వరకు సఫలీకృతమవుతాయనేది చర్చనీయాంశంగా మారిం ది. మొత్తానికి 2026 బడ్జెట్ దేశ ఆర్థిక భవిష్యత్తును పునాదుల నుంచే నిర్మించాలన్న సంకల్పానికి ప్రతిబింబం.

-- వ్యాసకర్త సెల్: 8466827118