calender_icon.png 5 February, 2026 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హర్షణీయం!

01-02-2026 12:00:00 AM

విద్యార్థినుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులే కాకుండా, వారు చదువుతున్న విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొనడం హర్షనీయం. నెలసరి పరిశుభ్రత కూడా ప్రాథమిక హక్కేననీ, రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం జీవించే హక్కులో, గోప్యతను పాటించే హక్కులో ఇది కూడా ఒక భాగమని భారత సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఫీజుల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్న విద్యాసంస్థలు తమ స్కూళ్లలో చది వే విద్యార్థినులకు నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులను గుర్తించి వారికి కనీస సౌకర్యాలు కల్పిస్తూ తగిన ఏర్పాట్లు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొనడం ద్వారా యాజమాన్యాలకు తమ బాధ్యతను గుర్తు చేసిం ది.

అంతేకాదు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో మగ పిల్లలకు, ఆడ పిల్లలకు వేరువేరుగా మరుగుదొడ్లను ఏర్పా టు చేయాలని, వాటిలో ఉపయోగించడానికి వీలయ్యే నీటి సౌకర్యం ఉండేలా చూడాలని, విద్యార్థినులకు పర్యావరణహిత శానిటరీ న్యాప్‌కిన్స్‌ను ఉచితంగా అందుబాటులో ఉంచాలని దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ తీర్పును అమలు చేయకపోతే ప్రైవేటు స్కూళ్ల గుర్తింపును రద్దుచేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేయకపోతే అందుకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలను బాధ్యులను చేస్తామని హెచ్చరించింది.  పాఠశాలల్లో విద్యార్థిను లకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు అందించాలని, కనీస పారిశుధ్య సౌకర్యాలు ఏర్పాటయ్యేలా చూడాలని తెలిపింది. ఇప్పటికీ దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మరుగుదొడ్ల సౌకర్యం అంతంతమాత్రంగానే ఉంది.

సౌకర్యాల లేమితో బాలికలు స్కూళ్లకు వెళ్లలే కపోతే ఇతర ప్రాథమిక హక్కులకు దూరమవుతున్నారు. సురక్షితమైన, ప్రభావవంతమైన నెలసరి శుభ్రత చర్యలు విద్యార్థినుల్లో అత్యున్నత ప్రమాణా లతో కూడిన లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యానికి దోహదపడుతుందని సుప్రీంకోర్టు పేర్కొనడం మెచ్చుకోదగిన అంశం. పాఠశాలల్లో బాలికలకు నెలసరి పరిశుభ్రత నిర్వహణ సదుపాయాలు, సౌకర్యాల లేమి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది.

ఇటీవల సుప్రీంకోర్టు ప్రజారోగ్యం, ప్రజల ప్రాథమిక హక్కుల గురించి స్పందిస్తున్న తీరు ప్రశంసనీయమని చెప్పొ చ్చు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వచ్ఛ భారత్ కార్యక్రమం పేరుతో వేలసంఖ్యలో శౌచాలయాలు నిర్మించేందుకు ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశ స్థితుగతులను మార్చే సినప్ప టికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలాచోట్ల గ్రామస్థులు బహిరంగ మలవిసర్జననే ఆశ్రయిస్తున్నారు.

పని నిమిత్తం బయటికి వచ్చే మహిళలకు మల విసర్జన, నెలసరి సమస్యలు ఎదురైనప్పుడు వారి బాధ వర్ణానాతీతం. మహిళల పరిస్థితిని అర్థం చేసుకున్న సుప్రీంకోర్టు చాలాసార్లు ఈ అంశమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టింది. సుప్రీం మొ ట్టికాయలేసినా ప్రభుత్వాలు ఆదేశాలకే పరిమితమవుతున్నాయి తప్ప ఆచరణకు పూనుకోవడం లేదు. అయితే ప్రభుత్వ సంస్థలతో పోలిస్తే ప్రైవేటు లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఫీజు పేరుతో వేలాది రూపాయిల దండుకుంటున్న విద్యాసంస్థలు ఆరోగ్య, సౌకర్యాల విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పు స్వాగతించాల్సిందే.