calender_icon.png 4 February, 2026 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ వ్యాధిపై అప్రమత్తం కావాలి

04-02-2026 02:40:55 PM

న్యాయమూర్తి శ్రీదేవి. 

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి అన్నారు. బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా జనరల్ హాస్పిటల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏ.శ్రీదేవి హాజరై క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే సరైన వైద్యం ద్వారా నివారించే అవకాశం ఉంటుందన్నారు.

ఈ సందర్భంగా ఆమె క్యాన్సర్ రోగులతో స్వయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్ బాధితులకు కుటుంబ సభ్యులు, సమాజం మానసిక ధైర్యం అందించాలని సూచించారు. రోగులు మానసికంగా దృఢంగా ఉండాలని, భయపడకుండా చికిత్స తీసుకోవాలన్నారు. వారితోపాటు జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి రవికుమార్,  అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ భవాని, ఆర్‌ఎం‌ఓ డాక్టర్ రవిశంకర్, గైనకాలజిస్ట్ డాక్టర్ సుప్రియ, డాక్టర్ అతిధి, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి, పాలియేటివ్ కేర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక, ఎన్‌సీడీ కోఆర్డినేటర్లు విజయ్ కుమార్, మల్లేష్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వై.శ్రీనివాసులు, హెల్త్ ఎడ్యుకేటర్ నరసింహ, డిపిఎంఓ సుకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.