బీఆర్‌ఎస్‌లోనే మహిళలకు గుర్తింపు
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, జూన్ 14 : బీఆర్‌ఎస్ పార్టీలోనే మహిళలకు తగిన గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు రంగేశ్వరి ఆధ్వర్యంలో ఆదివారం సాగర్ రింగ్ రోడ్డు లో ఉన్న ఒక ప్రైవేట్ హాల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలే సమాజానికి వెన్నెముక అని, వారి అభ్యున్నతి కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు.
మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత కోసం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, పార్టీ బలోపేతానికి మహిళా నాయకురాళ్లు మరింత చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మహిళలు ముందుండి పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో మహిళల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో హస్తినాపురం మాజీ కార్పొరేటర్ పద్మానాయక్, సీనియర్ నాయకురాలు సింగిరెడ్డి మల్లిశ్వరి రెడ్డి, డివిజన్ల మహిళా అధ్యక్షురాలు నాగలక్ష్మి, లత, ఆదిలక్ష్మి, కొసనం ధనలక్ష్మి, అంజలి గౌడ్, శైలజ, శిల్పారెడ్డి, విజయగౌడ్, నాయకురాలు రమాదేవి, కల్పన, శోభ, పావని, దేవి, ఉమాదేవి, విజయలక్ష్మి, మేరీ, ప్రభావతి, కళపూర్ణ, వరలక్ష్మి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాస కాలనీలో నూతన సీసీ రోడ్డు ప్రారంభం
నాగోల్, జూన్ 14 (విజయక్రాంతి): కొత్తపేట డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని, కాలనీల్లో రహదారులు, డ్రైనేజీ, మంచినీటి వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
ఈ కొత్త రోడ్డుతో స్థానికులకు, ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకల ఇబ్బందులు తప్పుతాయన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.కార్యక్రమంలో బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు లింగాల రాహుల్ గౌడ్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ చారి, ప్రతినిధులు భీంరాజ్, సుబ్బయ్య, సంపత్ కుమార్ గౌడ్, మహేష్ రెడ్డి, విశ్వేశ్వరరావు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






