నేడే బడి.. హడావుడి
- నేటి నుండి మోగనున్న బడి గంట
- పాఠశాలల పునఃప్రారంభంకు సర్వం సిద్ధం
- ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు
- పంపిణీకి సిద్ధంగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు
- మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ పాస్ట్
సూర్యాపేట, జూన్ 14 (విజయక్రాంతి) : 2026- 27 విద్యా సంవత్సరానికి సంబంధించి నేటి నుంచి బడి గంట మోగనుంది. 52 రోజుల వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు నేటి నుంచి పునఃప్రారంభమవుతు న్నాయి. వేసవి సెలవులను సరదాగా గడిపిన విద్యార్థులు ఆటాపాటలకు గుడ్బై చెప్పి మళ్ళీ బడిబాట పట్టనున్నారు.
పెరిగిన సెలవులు
వాస్తవానికి విద్యాశాఖ ప్రకటించిన షె డ్యూల్ ప్రకారం జూన్ 12 (శుక్రవారం) నుం డే బడులు తెరవాల్సి ఉంది. అయితే జూన్ 13న రెండో శనివారం, జూన్ 14న ఆదివారం రావడంతో వరుసగా రెండు సెలవు లు వచ్చాయి. ఒక రోజు పాఠశాల తెరిచి మళ్లీ రెండు రోజులు సెలవులు ఇవ్వడం కం టే, విద్యార్థులు, ఉపాధ్యాయుల సౌకర్యార్థం పాఠశాలల పునఃప్రారంభ తేదీని విద్యాశాఖ అధికారికంగా జూన్ 15కు మార్చింది. దీం తో 52 రోజుల పాటు మూలకు పడేసిన పు స్తకాల బ్యాగులను, టిఫిన్ బాక్సులను దు మ్ముదులిపి హడావుడిగా సిద్ధం అవుతున్నా రు.
మరోవైపు విద్యాశాఖ కూడా ఈ విద్యా సంవ త్సరం విద్యార్థులకు ఎ లాంటి అవాంతరాలు లేకుండా బడులు తెరిచిన మొదటి రోజే పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో సర్కా రు బడుల్లో చేరడానికి ఇద్యర్ధులు ఉత్సాహం చూపుతున్నారు.
సర్వం సిద్ధం
సూర్యాపేట జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గురుకు లాలు ఉన్నాయి. వీటిలో చదివే విద్యార్థుల కు ఈ విద్యా సంవత్సరం అవసరమైన పా ఠ్య పుస్తకాలలో కొన్ని ఇప్పటికే ఆయా పాఠశాలలకు అందించగా మిగతా పాఠ్య పుస్తకా లు కూడా త్వరలో అందించనున్నారు. జి ల్లాకు సరఫరా అయిన పాఠ్యపుస్తకాలను జి ల్లాలోని అన్ని మండల కేంద్రాలకు సరఫరా చేయగా సీఆర్పీలు మండలాల్లోని పాఠశాలల హెచ్‌ఎంలకు ఇప్పటికే పంపిణీ చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలను సైతం ఉపాధ్యాయు లు శుభ్రపరచి, అన్ని వసతులు కల్పించి సర్వం సిద్ధం చేశారు.
విద్యార్థులకు బ్రేక్ పాస్ట్
ఈ సంవత్సరం నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ ఫాస్ట్ ను అందించనున్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు అభ్యసన సామర్థ్యాల ను పెంచేందుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది.
విద్యార్థుల సంఖ్య పెంపునకు బడిబాట
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి విద్యాశాఖ గత నెల తేదీ నుంచి బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతి సౌకర్యాల గురించి వివరించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 10 వేల మంది విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 1900 మంది విద్యార్థులు అడ్మిషన్ లు తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
పంపిణీకి సిద్ధంగా పాఠ్య పుస్తకాలు
పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న సందర్భంగా మొదటి రోజే వి ద్యార్థుల కు పాఠ్య పుస్తకాలు, నోట్ బు క్స్ పంపిణీ చేయడానికి పాఠశాలల్లో సిద్ధం గా ఉన్నాయి. బడి ఈడు పిల్లలను ప్రభు త్వ పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యంగా బడిబాట నిర్వ హించాం. ఈ ఏడాది ప్ర భుత్వ పాఠశాలల్లో 10 వేల మంది వి ద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమై న ఇంగ్లిష్ మీడియం విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూని ఫాం అందిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి సర్కారు బడులను బలోపేతం చేయాలి.
కె.అశోక్, డీఈవో సూర్యాపేట






