అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు..
జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి
సికింద్రాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహి స్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్) ను సమర్థవంతంగా వినియోగించు కొని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా బీజేపీ నాయ కులు,కార్యకర్తలు పనిచేయాలని బీజేపీ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి పిలుపునిచ్చారు.
ఆదివారం అడ్డగుట్ట డివిజన్లో డివిజన్ అధ్యక్షురాలు సౌందర్య ఆధ్వ ర్యంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సారంగపాణి ఎస్‌ఐఆర్ కార్యక్రమం ప్రాధాన్యాన్ని వివరించారు.
ఓటరు జాబితాలో ఉన్న దొంగ ఓట్లు, మరణించిన వ్యక్తుల పేర్లు, ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన ఓటర్ల వివరాలను గుర్తించి ఎన్నికల నిబంధనల ప్రకారం తొలగించే ప్రక్రియలో కార్య కర్తలు చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర టీచర్స్ సెల్ కన్వీనర్ కొంజర్ల శ్రీనివాస్ కార్యకర్తలకు ప్రత్యేక అవగాహన కల్పించారు. బీజేపీ సీనియర్ నాయకులు టోపీశంకర్, హంసరాజ్, ఉదయ్ యాదవ్, సాయన్న, శివాజీ, అశ్విత, కళావతి పాల్గొన్నారు.






