14 June, 2026 | 7:46 PM

రాబోయే 3,4 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

14-06-2026 06:28 PM

హైదరాబాద్: రాబోయే మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణలోని అక్కడక్కడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని, వచ్చే నాలుగైదు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈనెల 18,19,20వ తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని,  గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో మరో 3 రోజులపాటు మార్పు ఉందని, ఇవాళ, రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వానాలు పడనున్నట్లు సమాచారం. పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షంతో పాటు ఉరుములు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.