15 June, 2026 | 1:33 AM

గర్భిణికి సకాలంలో రక్తం అందజేత

15-06-2026 12:29 AM

ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు

కామారెడ్డి, జూన్ 14 (విజయక్రాంతి): మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం అని ఐవిఎఫ్ సేవ దళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న గౌతమి (28) గర్భిణీకి ఏ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తాన్ని ఎల్లారెడ్డికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గోష్కే నాగరాజు మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలిపారు. 

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా యువత రక్తదానానికి ముందుకు రావాలన్నారు. రెడ్ క్రాస్, కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్)ల సంయుక్త ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని అన్నారు.రక్తదాత గోష్కే నాగరాజుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహo ఉపాధ్యక్షులు పర్ష వెంకటరమణ,ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.