అనగనగా ఓ రోడ్డు ప్రమాదం.. జరిగింది యాక్సిడెంట్
హత్యాయత్నం కేసుగా మార్చిన పోలీసులు..
పోస్టల్ జాబ్ గల్లంతు..
అంధకారమైన యువకుడి భవిష్యత్తు..
హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్న బాధిత కుటుంబం...
తాండూరు,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదం కేసు... హత్యాయత్నం కేసుగా మారింది. పోస్టల్ జాబ్ ఇంటర్వ్యూ మిస్ కావడంతో యువకుడి భవిష్యత్తు అందాకారంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ లో ఈ నెల రెండవ తేదీన స్కూటీ, బైక్ ఢీకొన్నాయి. ఇది పూర్తిగా రోడ్డు ప్రమాదం. ఇరువురి మధ్య ఎలాంటి పాత కక్షలు గాని గొడవలు గాని లేవు. పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్న ఘటనలు అసలే లేవు.
ఇక అదే రోజు గాయపడ్డ బైక్ (బుల్లెట్) వాహనదారుడి సోదరుడు మోయిజ్, స్కూటీ నడుపుతున్న మరుపల్లి అన్విరేష్(20) పై తగు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పెద్దేముల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. క్షుణ్ణంగా విచారణ చేయాల్సిన పోలీసులు ఏకంగా, IPC 307 హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈనెల 8వ తేదీన సదరు యువకుడి ఇంటికి వెళ్లి మీ కుమారుడి పై కేసు నమోదు అయింది పోలీస్ స్టేషన్ కు రావాలి అని పోలీసులు చెప్పడంతో అన్విరేష్ ని తీసుకొని తండ్రి శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు.
అక్కడ ఎస్సై కేసు విషయం చెప్పడంతో తండ్రి కొడుకులు ఇద్దరు కంగుతిన్నారు. జరిగింది యాక్సిడెంట్ అయితే హత్యాయత్నం కేసు ఎలా పెడతారని పోలీసులను వారు ప్రశ్నించారు . మేము అన్ని కోణాల్లో విచారణ చేసే కేసు పెట్టాం అని చెప్పి అన్వీరేష్ కు కోర్టులో హాజరు పరిచి హుటాహుటిన రిమాండ్ కు తరలించారు. ఈ సంగతి తెలిసిన ఫిర్యాదుదారులు అవాక్కయ్యారు మేము ఇచ్చిన ఫిర్యాదు రోడ్డు ప్రమాదం జరిగిందని ఆ దిశగా విచారణ చేసి న్యాయం చేయాలని పోలీసులను కోరామే తప్ప .. హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరలేదని. ..అలా దరఖాస్తు చేయలేదని...ఫిర్యాదుదారులు అనడం ఇక్కడ గమనహ్రo
జీవితం తలకిందులు:
రిమాండ్‌కు వెళ్లిన యువకుడు అన్వీరేష్ ఈ నెల 9వ తేదీన పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంది. పోలీసుల చర్య వల్ల ఇంటర్వ్యూకు వెళ్లలేకపోయాడు. జీవితంలో వచ్చిన గొప్ప అవకాశాన్ని కోల్పోయాడు. ఇదిలా ఉండగా పోలీసుల ఏకపక్ష తీరుపై బాధిత యువకుడి కుటుంబ సభ్యులు, ఫిర్యాదుదారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
"మా మధ్య ఎలాంటి గొడవ లేదు. పాత కక్షలు లేవు. .ఇది యాక్సిడెంట్ మాత్రమే. పోలీసులు హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదని. ఫిర్యాదు దారుడు మోయిజ్ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి తీవ్ర దుమారం లేపింది. ఈ ఘటనపై బాధిత కుటుంబం తో పాటు, ఫిర్యాదుదారులు తమకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
మరోవైపు మానవ హక్కుల కమిషన్ కు, రాష్ట్ర హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీ వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరిపి, తప్పుడు కేసు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, సిఐటియు జిల్లా నాయకులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్ మాట్లాడుతూ ఫిర్యాదు మేరకే అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కేసు నమోదు చేశాం.. రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గి కేసు నమోదు చేశామన్న వార్తల్లో నిజం లేదు.






