తుర్కియేకు ఆస్ట్రేలియా షాక్
15-06-2026 01:31 AM
వాంకోవర్, జూన్ 14: ఫిఫా వరల్డ్‌కప్‌లో అంచనాలు లేని జట్లు అదరగొడుతున్నాయి. దాదాపు 24 ఏళ్ల సుధీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్ బరిలో నిలిచిన తుర్కియేకు ఆస్ట్రేలియా షాకిచ్చింది. కెనడాలోని వాంకోవర్ వేదికగా జరిగిన గ్రూప్-డి ఆరం భ మ్యాచ్‌లోతుర్కియేపై 2- గోల్స్ తేడా తో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
మ్యాచ్ ప్రారంభమైన 27వ నిమిషంలోనే ఆస్ట్రేలియా ఫార్వర్డ్ ఆటగాడు నెస్టోరీ ఇరాన్కుందా అద్భుతమైన కౌంటర్ ఎటాకింగ్ గోల్‌తో జట్టుకు 1 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత టర్కీ ఆటగాళ్లు మ్యా చ్ను డ్రా చేయడానికి తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆస్ట్రేలి యా డిఫెన్స్ దాన్ని తిప్పికొట్టింది. 75వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ కానర్ మెట్‌కాఫ్ గోల్ కొట్టి ఆస్ట్రేలియా విజయాన్ని పూర్తిగా ఖాయం చేశాడు.






