15 June, 2026 | 2:46 AM

బ్రెజిల్, మొరాకో మ్యాచ్ డ్రా

15-06-2026 01:32 AM

న్యూయార్క్, జూన్ 14: ఫిఫా ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటైన బ్రెజిల్‌కు తొలి మ్యాచ్‌లో ఊహించని పోటీ ఎదురైంది. ఆఫ్రికా జట్టయిన మొరాకో బ్రెజిల్ లాంటి పెద్ద జట్టుకు గట్టిపోటీనిచ్చింది. అద్భుతంగా పోరాడి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

ఆట ప్రారంభమైన 21వ నిమిషంలో మొరాకో ప్లేయర్ ఇస్మాయిల్ సైబారి గోల్ కొ ట్టి.. తన జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే కొన్ని నిమిషాల్లోనే బ్రెజిల్ కూడా గోల్ కొట్టింది. 32 నిమిషంలో బ్రెజిల్ ఆటగాడు వినీసియస్ జూనియర్ గోల్ కొట్టడంతో ఇరు జట్లు 1- సమంగా నిలిచాయి. తొలి అర్ధభాగంలో మొరాకో జట్టు ఆధిప త్యం చెలాయించింది. ఈ మ్యాచ్లో బంతి ఎక్కువ సమయం బ్రెజిల్ నియంత్రణలోనే ఉన్నప్పటికీ అందివచ్చిన అవకాశాలను స ద్వినియోగం చేసుకోలేకపోయింది.