15 June, 2026 | 1:09 AM

విద్యుత్ శాఖ మొద్దునిద్ర..?

15-06-2026 12:25 AM
  1. చినుకు పడితే నగరవాసుల వెన్నులో వణుకు..?
  2. కరెంట్ షాక్‌తో నలుగురు మరణించినా విద్యుత్‌శాఖ అలసత్వం ఎందుకు?
  3. కరెంటు తీగలు తెగిపడి సిటీలో నలుగురు మృతి చెందినా స్పందన కరువు 
  4. ఆగ్రహం వ్యక్తం చేసిన అల్వాల్, బండ్లగూడ బాధిత కుటుంబాలు

రంగారెడ్డి, జూన్ 14 (విజయక్రాంతి): ఒక చిన్న తొండ, ఉడుతలు పాకినా.. విద్యు త్ తీగలకు తగిలిన చాలు.. క్షణాల్లో సబ్‌స్టేషన్లలో ఫీడర్లు ట్రిప్ అయి విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అంతటి సున్నితమైన సాంకేతికత ఉందని చెప్పుకొనే విద్యుత్ శాఖ.. ఒక నిండు ప్రాణం తీగలకు చిక్కుకున్నా.. హై-వోల్టేజ్ లైన్ తెగి కారుపై పడి ప్రాణాలు కోల్పో యినా ఎందుకు స్పందించలేదు? రక్షణ వ్యవస్థలు ఎందుకు పనిచేయలేదు?

ప్రస్తు తం అల్వాల్, బండ్లగూడ బాధితులు, హైదరాబాద్ నగరవాసులు విద్యుత్ శాఖను నిల దీస్తున్న అక్షర సత్యాలు ఇవి. సిటీ పరిధి లో విద్యుత్తు తీగలు తెగుపడి నలుగురు మృతి చెందడంతో సిటీ వాసుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల కురిసిన స్వల్ప వర్షాలకే నగ రంలో ఘోర ప్రమాదాలు జరిగాయి. బండ్లగూడలో యువకుల తో పాటు అల్వాల్ లో కారులో ప్రయాణిస్తున్న వారిపై కరెం టు తీగలు తెగిపడి  నలుగురు విద్యుత్ఘాతానికి బలయ్యారు. వీరంతా కేవలం స్ట్రీ ట్ లైట్ వైర్ల నుంచి ప్రసరించిన విద్యుత్ ధాటికే నేలకూలడం గమనార్హం.

లోపించిన సాంకేతిక వైఫల్యం..

సాధారణంగా వీధి దీపాలకు  విద్యుత్ సరఫరాను లో-టెన్షన్ (ఎల్ టీ) లైన్ల నుంచే తీసుకుంటారు. గృహ అవసరాలకు వాడే ఈ 230వోల్ట్ లైన్ తెగిపడినప్పుడు లేదా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు తక్షణమే రక్షణ కవచాలుగా పనిచేయాల్సిన వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయి. సాధార ణంగా విద్యుత్ లైన్ తెగి కింద పడినప్పుడు లేదా భూమికి తగిలినప్పుడు , విద్యుత్ ప్రవాహం ఒక్కసారిగా పెరిగి సబ్స్టేషన్లోని సర్క్యూట్ బ్రేకర్లు గానీ, స్థానిక ట్రాన్స్ఫార్మర్ వద్ద ఉండే ఎంసీబీ  లేదా ఫ్యూజులు గానీ ట్రిప్ అవ్వాలి... కానీ అవడం లేదు.

మెయింటెనెన్స్ లోపం..

అల్వాల్ లో కారుపై తీగలు పడి ఇద్దరు చనిపోయినా కరెంట్ సరఫరా ఆగిపోలేదంటే.. రక్షణ వ్యవస్థలు ఎంత తుప్పుపట్టా యో అర్థమవుతోంది. నాసిరకం వైర్లు వాడటం, సరైన ఎర్తింగ్ లేకపోవడం వల్లే ఈ ఘో రం జరిగింది. క్షేత్రస్థాయి లో అదనపు వాస్తవాలు ఈ ప్రమాదాల వెనుక వి ద్యుత్ శాఖ నిర్లక్ష్యం స్పష్టం గా కనిపిస్తోందని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఏటా వర్షాకాలానికి ముందు చెట్ల కొ మ్మలు నరకడం, లూజ్ వైర్లను సరిచేయడం  వంటి పనులు చేయాలి. కానీ కేవలం కాగితాలకే ఇవి పరిమితం అవుతున్నాయన డానికి ఈ లైన్లు తెగిపడటమే నిదర్శనం.

అండర్ గ్రౌండ్ కేబుల్స్ లేకపోవడం..

గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో ఇప్పటికీ అనేక చోట్ల ఓవర్ హెడ్ (గాల్లో వేలాడే) వైర్లే ఉన్నాయి. వర్షం, గాలి రాగానే ఇవి తెగిపడి మృత్యుపాశాలుగా మా రుతున్నాయి. ఇందులో వివిధ శాఖల  సమన్వయ లోపం జీహెచ్‌ఎంసీ స్ట్రీట్ లైట్ల నిర్వహణ, విద్యుత్ శాఖ సరఫరా మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల వీధి దీపాల వైర్లు అడ్డదిడ్డంగా వేలాడుతున్నాయి.

బాధితుల డిమాండ్లు..

ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలు రోడ్డుపైకి వచ్చి తమకు న్యా యం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కరెంట్ తీగలపై బల్లులు,ఉడుతలు పడితే ఆగిపోయే కరెంట్, మనుషులు చనిపోతున్నా ఎందుకు ఆగలేదు? దీనికి కారణ మైన అధికారులపై క్రిమినల్ కేసులు నమో దు చేయాలి‘ అని బాధితులు మండిపడుతున్నారు. నగరంలోని అన్ని ట్రాన్స్ఫార్మర్లు, స్ట్రీట్ లైన్ జంక్షన్ బాక్సులను తక్షణమే సురక్షితంగా మార్చాలని  ప్రతి ట్రాన్స్ఫార్మర్ వద్ద అధునాతన ప్రొటెక్షన్ రిలేలు, ఎర్త్ ఫాల్ట్ ఇండికేటర్లు అమర్చాలని బాధ కుటుంబాలు స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

చనిపోయిన వారి కుటుంబాలకు విద్యుత్ శాఖ నుంచి తక్షణ భారీ ఎక్స్గ్రేషియా ప్రకటించి, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. వర్షాలు పడిన ప్రతిసారీ నగరవాసులు ప్రాణాలు చేతపట్టుకుని తిరగాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం. ఇప్పటికైనా విద్యుత్ శాఖ మొద్దునిద్ర వీడి శాశ్వత పరిష్కారాలు చూపకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. ఆ దిశగా ప్రభుత్వము విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సిటీ ప్రజలు కోరుతున్నారు.