18 April, 2026 | 3:01 AM

మహిళ అదృశ్యం

18-04-2026 01:40 AM

జహీరాబాద్, ఏప్రిల్ 17: జహీరాబాద్ లోని దత్తగిరి కాలనీకి చెందిన వనుము నాగరాణి అనే మహిళ అదృశ్యమైనట్లు జహీరాబాద్ పట్టణ ఎస్త్స్ర కి వినయ్ కుమార్ తెలిపారు. దస్తగిరి కాలునీ కి చెందిన రజిని కుమార్ దస్తగిరి కాలనీలో కూలి పని చేసుకుంటూ భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడని తెలిపారు.

రజనీ కుమార్ భార్య నాగరాణి ఈనెల 15న రాత్రి ఇంట్లో నుండి ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోయిందని ఎస్‌ఐ తెలిపారు. ఆమె భర్త బంధువుల వద్ద తెలిసిన వారి వద్ద విచారించినప్పటికీ ఎలాంటి జాడ తెలియక పోవడంతో శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చారని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.