పాము కాటుకు మహిళ మృతి
24-05-2026 12:13 AM
తునికాకు ఏరేందుకు వెళ్లగా ప్రమాదం
కొత్తగూడ మండలం కర్నేగండిలో ఘటన
మహబూబాబాద్, మే 23 (విజయక్రాంతి): జీవనోపాధి కోసం తునికాకు ఏరడానికి వెళ్లిన మహిళా కూలి పాముకాటుకు గురై మరణించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడా మండలం కర్నే గండిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజకుమార్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మద్దెల పల్లవి(35) జీవనోపాధి కోసం గ్రామస్తులతో కలిసి ఈనెల 21న తునీకాకు సేకరణకు అడవికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెను పాము కాటు వేయడంతో వెంటనే గ్రామస్తులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మరణించింది.






