రోజ్‌గార్ మేళా లక్ష్యం యువత సాధికారతే
- రోజ్‌గార్ మేళాతో లక్షలాది ఉద్యోగ అవకాశాలు
- మేక్ ఇన్ ఇండియాతో తయారీ రంగంలోనూ ఉపాధి
- సికింద్రాబాద్‌లో 19వ విడత మేళా ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- 218 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత
సికింద్రాబాద్, మే 23 (విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు ఉద్యో గాలు కల్పించడంతో పాటు వారికి సాధికారత కల్పించే దిశగా రోజ్‌గార్ మేళాలు నిర్వహిస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేసిన ఈ మేళాల ద్వారా 2022 సంవత్స రం నుంచి లక్షలాది మంది యు వతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగా లు లభించాయని చెప్పారు.
దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో చేప ట్టిన 19వ విడత రోజ్‌గార్ మేళా కార్యక్రమం శనివారం సికింద్రాబాద్‌లోని రైల్ కళారంగ్ వేదిక గా కిషన్‌రెడ్డి ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజ య్‌కుమార్ శ్రీవాత్సవ, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సిద్దార్థ్ కటి, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్‌తో కలిసి కేంద్ర ప్రభుత్వంలోని ఆరు శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన 218 మంది యువతకు కిషన్‌రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభు త్వ శాఖలు, పీఎస్‌యూలలో ఖాళీలు లేకుం డా ఉద్యోగాలు భర్తీ చేస్తూ, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తోందని అన్నారు. ఇప్పుడు దేశ యువత ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా మారుతున్నారని పేర్కొన్నారు. అంకుర సంస్థలు సైతం లక్షలాది ఉద్యోగాలను కల్పిస్తున్నాయ ని, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా తయారీ రంగంలోనూ పెద్దఎత్తున ఉద్యోగాలు లభిస్తున్నాయని గుర్తుచేశారు.
ఉద్యో గాలకు ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగం లభించడం ద్వారా 20--30 ఏళ్లు దేశానికి సేవ చేసే అవకాశం లభిస్తుందని, దేశాభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం అంకితభా వం, సేవా దృక్పథంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. తమ కోసం ఎన్నో కష్టాలు పడి న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దని, వారికి వృద్ధాప్యంలో తోడుగా ఉండాలని సూచించారు. కాగా దేశవ్యాప్తంగా 19వ విడత రోజ్‌గార్ మేళాను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.






