24 May, 2026 | 2:23 AM

మాస్టర్స్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ ఆవిష్కరణ

24-05-2026 01:19 AM

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యం లో జరగనున్న మాస్టర్స్ ప్రీమియర్ లీగ్ మూ డో సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ ఈ నెల 25 నుంచి జూన్ 4 వరకూ జరగనుంది. టోర్నీకి సంబంధించిన ట్రోఫీని నిర్వాహకులు ఆవిష్కరించారు. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఫ్రాం చైజీ ఓనర్లు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

డిఫెండింగ్ ఛాంపియన్ కరీంనగర్ కింగ్స్, హైదరాబాద్ హీరోస్, నల్గొండ లయన్స్, రంగారెడ్డి రేసింగ్ బుల్స్, ఆదిలాబాద్ టైగర్స్, డీసీపీ స్ట్రుకింగ్ ఫోర్స్ ఎలెవన్ వికారాబాద్ జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. విజేతగా నిలిచే జట్టుకు లక్ష రూపాయల ప్రైజ్‌మనీ లభించనుంది. రన్నరప్‌తో పాటు ప్రతీ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు కూడా క్యాష్ ప్రైజ్ అందజేయనున్న ట్టు నిర్వాహకులు తెలిపారు. వయసు పెరిగినా ఆట తగ్గని వెటరన్ క్రికెటర్లకు ఇది చక్కని వేదికగా పేర్కొన్నారు.