హీట్ వేవ్‌పై అప్రమత్తం
- ప్రజల ప్రాణాల రక్షణకు అత్యంత ప్రాధాన్యత
- వడగాల్పులతో ఏడు జిల్లాల్లో 16 మంది మృతి
- మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం
- రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ప్రభావంపై మంత్రి పొంగులేటి సమీక్ష
హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యంతో పనిచేయాలని అధికార యంత్రాంగాన్ని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. వడగాల్పుల వల్ల ఏడు జిల్లాల్లో 16 మంది మృ తి చెందారని, ఈ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని తెలిపారు.
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజ లకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా తక్ష ణ చర్యలు చేపట్టాలని, జీవరాశుల సంరక్షణకు కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వచ్చే మూడు రోజుల్లో వడగాల్పుల ప్రభావం మరింత పెరగనుందని, జిల్లా కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
రాష్ట్రం లో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పుల పరిస్థితుల నేపథ్యం లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం సచివాలయంలో ఉన్నతాధికారుల తో అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్ పరిస్థితులపై జిల్లాల వారీగా నివేదికలను పరిశీలించి, ప్రజల ప్రా ణ రక్షణకు అత్యంత ప్రాధాన్యంతో పనిచేయాలని అధికార యంత్రాంగానికి స్పష్టమై న ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో జిల్లాల కలెక్టర్ల నివేదిక ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నలుగురు, వరంగల్ అర్బన్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, జోగులాంబ రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కరు చొప్పున, మొ త్తం ఏడు జిల్లాల్లో 16 మంది వడదెబ్బతో మృతి చెందారని అధికారులు మం త్రి దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి స్పందిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పు న నష్ట పరిహారం ఇవ్వాలని, ఇందుకు సం బంధించిన ప్రక్రియను త్వరిత గతిన పూర్తిచేయాలని ఆదేశించారు.
ఎండల తీవ్రత అసా ధారణ స్థాయికి చేరుకుంటోందని, తీవ్రస్థా యి ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత మరింత పెరిగిందన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాం గం మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రజ ల ప్రాణాల రక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావుండకూడదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న మండలాలు, గ్రామాలను ప్రత్యేకంగా గుర్తించి, అక్కడి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపాలని, మీడియా, సోషల్ మీడి యా, గ్రామస్థాయి ప్రకటనల ద్వారా ఎండలపై అప్రమత్తత కల్పించాలని ప్రజలకు అవ సరమైన సమాచారం ప్రతి గంటకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
బస్టాండ్లు, మార్కెట్లు, ప్రధాన రహదారులు, కార్మికులు ఎక్కువగా పనిచేసే ప్రాంతాలు, ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే చోట్ల చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఉదయం 11 గంటల నుంచి సాయం త్రం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితు ల్లో తప్ప బయటకు రావొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
మండల స్థాయి అధికారుల నుంచి గ్రామస్థాయి సిబ్బంది వరకు అందరూ ఫీల్డ్‌లో ఉండాలని, ఎండదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందించేలా అత్యవసర వైద్య సేవలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈనెల 26వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎండ తీవ్రత, తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.






