24 May, 2026 | 1:04 AM

ఈదురుగాలుల వాన బీభత్సం!

24-05-2026 12:11 AM
  1. వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అకాల వర్షం
  2. పిడుగుపాటుకు ఇద్దరు మృతి
  3.   30 గొర్రెలు మృత్యువాత

నాగర్‌కర్నూల్/గద్వాల/అచ్చంపేట/బిజినేపల్లి/చిన్నంబావి, మే 23 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో శనివారం కురిసిన అకాల వర్షం, భారీ ఈదురు గాలు లు రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరిచాయి. కొ నుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం, మక్క లు తడిసి ముద్దయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట, బిజినపల్లి, లింగాల, ఉప్పునుంతల, పెద్దముద్దునూరు, తూడుకుర్తి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

ఈ దురు గాలుల ప్రభావంతో ధాన్యంపై కప్పిన టార్పాలిన్లు ఎగిరిపోయి, వేల టన్నుల ధాన్యం తడిసిపోయింది. పలు చోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో అటుగా వెళుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు భారీ వృక్షాలను రోడ్డుపై నుండి తప్పించా రు. తాడూరు మండలం గోవిందాయపల్లి గ్రామంలో పిడుగుపాటుకు చింత కింది మల్లయ్య (40) గొర్రెల కాపరి మృతి చెందా డు.

మరోవైపు బిజినపల్లి మండలం లింగసానిపల్లి వద్ద పడిన పిడుగుతో చేగుంట గ్రామానికి చెందిన రైతు సుమారు 5లక్షల విలువజేసే 30 గొర్రెలను కోల్పోయాడు. అచ్చంపేట మండలం బుడ్డతాండలోని గిరిజన రైతు మోత్యకు చెందిన లక్షల విలువ చేసే రెండు పశువులు పిడుగుపాటుకు మృ తి చెందాయి. వనపర్తి జిల్లా చిన్నంబావి మండల పరిధిలోని చెల్లెపాడు గ్రామానికి చెందిన బెల్లరి నాగార్జున (35) అనే గొర్ల కాపరి పిడుగు పాటు గురై మృతి చెందాడు.

సాయంత్రం ఈదురు గాలులు పిడుగులతో కూడిన వర్షం కురిసింది. గొర్ల మంద  దగ్గర పిడుగుపాటుకు గురైన మరణించాడు. మృ తడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. అలాగే మండల పరిధిలోని దగడ పల్లి గ్రామంలో పిడుగుపాటుకు రైతులు తమ ఎద్దుల కొరకు వేసుకున్న మూడు గడ్డి వాములు దగ్ధమయ్యాయి. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పివేశారు. గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎద్దులగూడెం గ్రామంలో ఇండ్ల సమీపంలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది.