10 April, 2026 | 10:05 PM

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

10-04-2026 08:04 PM

చిట్యాల,(విజయక్రాంతి): రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన దోర్నాల రాములు అకాల మరణం చెందగా ఆయనకు నలుగురు కూతుర్లు ఉండగా పెద్ద కూతురు రమాదేవి తండ్రికి తలకొరివి పెట్టి పలువురిని కంటతడి పెట్టించింది. రెండవ కూతురు రజిని మూడవ కూతురు విజయ, నాలుగవ కూతురు కల్పన మొత్తం నలుగురు కూతుర్లు తండ్రి మరణంతో తనయురాలు తలకొరివి పెడుతుంటే గ్రామస్తులు కంటతడి పెట్టారు. కంటే కూతుర్నే కనాలి రా అన్న విధంగా పలువురిని ఆలోచింపజేశారు. ఏది ఏమైనా కూతురు తల కొరివి పెట్టడం ఒక విశేషం. ఈ యొక్క దహన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ గ్రామ పెద్దలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.