జనగణన భూ స్వాధీన పనుల పరిశీలన
జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
కోరుట్ల,(విజయక్రాంతి): కోరుట్ల ఆర్డిఓ కార్యాలయంలో కొనసాగుతున్న జనగణన (సెన్సెస్) భూ స్వాధీన పనులను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడి పనుల ప్రగతిని సమీక్షించారు జనగణన కార్యక్రమం దేశ అభివృద్ధికి కీలకమని పేర్కొన్న కలెక్టర్ ఖచ్చితమైన సమాచారం సేకరణకు అధికారులు కట్టుబడి పని చేయాలని సూచించారు ప్రతి ఇంటికి చేరుకొని సమగ్ర వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు అలాగే భూ స్వాధీన ప్రక్రియను పారదర్శకంగా వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు.
సంబంధిత భూ యజమానులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం నిర్ణీత కాలపరిమితిలో అన్ని పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి తహసీల్దార్ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు




