100 కోట్ల వ్యత్యాసమెందుకు?
21-04-2026 03:02 AM
- ఒక అఫిడవిట్‌లో చరాస్తుల విలువ 225 కోట్లు
- మరో అఫిడవిట్‌లో 105 కోట్లు
- వివరణ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు నోటీసులు
చెన్నై, ఏప్రిల్ ౨౦: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీకే అధినేత విజయ్‌కి చుక్కెదురైంది. విజయ్ దాఖలు చేసిన రెండు ఎన్నికల అఫిడవిట్‌లలో వ్యత్యాసాలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు సోమవారం నోటీసులు జారీచేసింది. తిరుచ్చి తూర్పు నియోజకవర్గంలో సమర్పించిన అఫిడవిట్‌లో చరాస్తుల విలువ రూ.225 కోట్లుగా, పెరంబుదూర్ నియోజకవర్గ అఫిడవిట్‌లో రూ.105 కోట్లు చూపారని, ఈ వ్యత్యాసం రూ.100 కోట్లు ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యత్యాసంపై విజయ్ వివరణ ఇవ్వాలని కోర్టు సూచించింది.






