ఆయిల్ పామ్ సాగుతో ఫలితాలు సాధిస్తున్న రైతు ప్రభాకర్ రెడ్డికి సన్మానం
సుల్తానాబాద్, జులై 3 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలోని గోపిడి ప్రభాకర్ రెడ్డి ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ తోటను శుక్రవారం పరిశీలించి, రైతును స న్మానించారు. అల్లీపూర్ గ్రామానికి చెందిన గోపిడి ప్రభాకర్ రెడ్డి తన వ్యవసాయ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.
గతంలో తన ఆరు ఎకరాల భూమిలో వరి సాగు చేసే ప్రభాకర్ రెడ్డికి, పెట్టుబడులు పోను ఏడాదికి దాదాపు 3 లక్షల రూపాయ ల ఆదాయం వచ్చేది. అయితే, 2022లో తె లంగాణ ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా చే పట్టిన ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలని ఆయన నిర్ణ యించుకున్నారు.
ఫలితంగా 2022 సెప్టెంబర్ 9న ప్రభుత్వం అందించిన సబ్సిడీతో ఆరు ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయి కిరణ్, పెద్దపల్లి ఉద్యాన అధికారి సుంకే మ హేష్, ఉద్యాన విస్తరణ అధికారి బి. మహేష్, వ్యవసాయ విస్తరణ అధికారి రవి తేజ, ఆయిల్ పామ్ ఫీల్ ఆఫీసర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.






