హైదరాబాద్‌లో ‘జోరు’ వానలు
జంట నగరాలకు అధికారుల హైఅలర్ట్
సిటీబ్యూరో, జూలై 3 (విజయక్రాంతి): రాజధాని హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరం అంతటా ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. ఇప్పటికే నగరంలోని ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కూకట్పల్లి, సికింద్రాబా ద్, అమీర్పేట్, కోఠి, అబిడ్స్, మాసబ్ట్యాంక్, బంజారాహిల్స్, దిలుసుఖ్ నగర్, ఎల్బీనగర్ తదితర ఏరియాల్లో శుక్రవారం రాత్రి నుంచి శఎడతెరిపి లేకుం డా చిరుజల్లులు, మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం, శుక్ర వారం రాత్రి వేళకు నగరంలో బలమైన ఈదురు గాలులతో (గంటకు 40-50 కి.మీ వేగంతో) కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రాబోయే 48 గంటల పాటు నగరంలో ఇదే పరిస్థితి కొనసాగవచ్చని, ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని అంచనా వేస్తున్నారు. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 31ఓC, కనిష్ట ఉష్ణోగ్రత 25ఓCగా నమోదయ్యే అవకాశం ఉంది.
గత రాత్రి కురిసిన వర్షాల కారణంగా ఇప్పటికే పలు లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మాదాపూర్, గచ్చిబౌలితో పాటు దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్ రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నెమ్మదించింది. రోడ్లపై ఉన్న డ్రైనేజీలు పొం గిపొర్లుతుండటంతో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది రంగంలోకి దిగి నీటిని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు.
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు హైఅలర్ట్ ప్రకటిం చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే త ప్ప ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఇళ్లనుంచి బయటకు రాకూడదు. నగరవాసులు ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురై నా జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్ నంబర్లను సం ప్రదించాలని అధికారులు సూచించారు.






