4 July, 2026 | 2:32 AM

5వేల పోలీసు ఉద్యోగాలకు ఆమోదం

04-07-2026 01:36 AM
  1.   10 విభాగాల్లో భర్తీ
  2. త్వరలోనే నోటిఫికేషన్
  3. కానిస్టేబుల్(సివిల్) 3,697 పోస్టులు

హైదరాబాద్, జూలై 3(విజయక్రాంతి): పోలీసు శాఖలో 5వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్రప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే నోటిఫికేషన్, అర్హత, వయోపరిమితికి సంభందిచిన ప్రకటన విడుదల చేయనుంది. మొత్తం 10 విభాగాల్లో 5000 పోస్టులను భర్తీ చేయనుంది.

అత్యధికంగా పోలీసు కానిస్టేబుల్(సివిల్) విభాగంలోనే 3,697 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుల్ విభాగంలో 1,052, సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్) 148, సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఆర్మ్‌డ్ రిజర్వ్) 14, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (టీజీఎస్పీ) 12, సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఆర్ సీపీఎల్) 3, అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎఫ్‌పీబీ)23, కానిస్టేబుల్ (ఎస్‌ఏఆర్ సీపీఎల్) 24, కానిస్టేబుల్ (డ్రైవర్ పీటీవో) 20, మెకానిక్ పీటీవో 7 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.