చర్చలకు రామ్ రామ్
- తమ ఓడరేవుల దిగ్బంధంపై ఇరాన్ కన్నెర్ర
- అరేబియన్ జలాల్లో తమ నౌక సీజ్‌పైనా ఆగ్రహం
- అమెరికన్ యుద్ధనౌకలపై డ్రోన్లతో మెరుపుదాడి
- మా బృందం ఇస్లామాబాద్ బయల్దేరింది: ట్రంప్
- జేడీ వాన్స్ బృందం అమెరికాలోనే ఉందని మీడియా కథనాలు
టెహ్రాన్, ఏప్రిల్ ౨౦: అరేబియన్ సముద్రజలాల్లో అమెరికన్ సైన్యం తమ నౌకపై దాడిచేసి స్వాధీనం చేసు కోవడం, నౌకాశ్రయాలను దిగ్బంధిం చడం తమకు ఏమాత్రం ఆమోద యోగ్యంకాదని ఇరాన్ సోమవారం ప్రకటించింది. పైగా అలవిగాని డి మాండ్లు పెట్టి చర్చలకు ఆహ్వానిం చడమేంటని నిలదీసింది. అందుకే తాము పాకిస్థాన్ రాజధాని ఇస్లామా బాద్ వేదికగా జరగాల్సిన రెండోవి డత శాంతిచర్చలకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు కుండబద్దలు కొట్టింది.
అమెరికా ఉపాధ్యక్షు డు జేడీ వాన్స్ నేతృత్వంలో ఒక బృం దం ఇస్లామాబాద్‌కు చేరుకుంటుందని ఆ దేశాధ్యక్షుడు ప్రకటించిన కొ ద్దిసేపటికే ఇరాన్ శాంతిచర్చలకు ‘నో’ అని చెప్పడం గమనార్హం. ఒకవైపు శాంతిచర్చలకు రంగం సిద్ధం చేసుకుంటూ, మరోవైపు చర్చలకు రాకుంటే విద్యుత్ ప్లాంట్లు, మౌలిక వసతులు కూల్చివేస్తామని ట్రంప్ హెచ్చరించ డం ఇరాన్‌కు ఆగ్రహం తెప్పించింది.
అరేబియన్ జలాల గుండా వెళ్తున్న ‘టౌస్కా’ తమ సరుకు రవాణా నౌకపై అమెరికన్ సైన్యం దా డిచేసి స్వాధీనం చేసుకోవడమూ ఇరాన్‌కు కో పం తెప్పించింది. అమెరికా చర్యను సముద్ర పు దొంగలు చేసే పని అంటూ పేర్కొంది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ఇరాన్ దేశా ధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఫోన్‌లో సం భాషించారు. అమెరికా బెదిరింపులకు పాల్పడటం శాంతి చర్చలకు పెద్ద విఘాతమన్నారు.
ఇరాన్ డ్రోన్ల దాడి
తమ నౌకను స్వాధీనం చేసుకున్నందుకు ప్రతిగా, ఇరాన్ కూడా అరేబియన్ జలాల్లోని అమెరికన్ యుద్ధనౌకలపై డ్రోన్లతో మెరుపు దాడి చేసింది. పెద్దసంఖ్యలో ఆత్మాహుతి డ్రో న్లు దూసుకురావడంతో అమెరికన్ నావికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. కొన్ని డ్రోన్లను గగనతలంలోనే పేల్చివేశారు.
ట్రంప్‌తో మునీర్ ఫోన్ సంభాషణ
పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఇరాన్‌లోని ఓడరేవుల బ్లాకేడ్, నౌక స్వాధీనం సరికాదని మునీర్ అభిప్రాయపడ్డారు. శాంతిచర్చలకు ఆ చర్యలు విఘాతంగా మారాయని, ఇప్పటికైనా పంతం వీడి వెనక్కి తగ్గాలని విజ్ఞప్తి చేశారు. విజ్ఞాపనలపై ట్రంప్ సానుకూలంగా స్పందించారని, ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధం విషయంలో పునరాలోచిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఇరాన్ నేతలతో భేటీకి సిద్ధం: ట్రంప్
శాంతిచర్చలకు ఇరాన్ అంగీకరిస్తే, స్వయం గా తానే ఇస్లామాబాద్ వెళ్లి ఆ దేశ నేతలతో భేటీ అవుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. శాంతిచర్చల కోసం ఇప్పటికే ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్, ప్రభుత్వ సలహాదారులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ బృందం ఇస్లామామాద్ బయల్దేరిందని కూడా వెల్లడించారు. ఇరాన్ అణు పరీక్షలు మానుకుంటే స మస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు.
వాన్స్ బృందం బయల్దేరిందా? లేదా?
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్ నేతృత్వంలోని బృందం ఇస్లామాబాద్ బయల్దే రిందని ట్రంప్ చెబుతుండగా, వారింకా బయల్దేరలేదని, వారు ఇంకా అమెరికాలోనే ఉన్నా రని అక్కడి మీడియా కథనాలు పేర్కోన్నా యి.






