4 July, 2026 | 3:58 AM

‘విప్‌ఆది’ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు

04-07-2026 02:55 AM

వేములవాడ, జూలై 3,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ రూరల్ మండలం,తుర్కాశిపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ మాజీ సర్పంచ్ ఎస్కే హుస్సేన్, గ్రామ శాఖ అధ్యక్షుడు సయ్యద్ మోదిన్తో పాటు పలువురు గ్రామస్థులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వారికి కాంగ్రెస్ కండువా క ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భం గా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసంతో ప్రజలు కాంగ్రె స్లో చేరుతున్నారని అన్నారు. యువత, సా మాజిక కార్యకర్తలు కాంగ్రెస్ను బలోపేతం చేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు.