అర్బన్ బ్యాంకు ఎన్నికల ఫలితాలపై స్టే
కరీంనగర్, జూలై 3 (విజయ క్రాంతి): కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల ఫలితాలపై వరంగల్ కోపరేటివ్ ట్రిబ్యునల్ స్టే విధించింది. అధ్యక్షునిగా విలాస్ రెడ్డిని కొ నసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూకీలక ఆదేశాలు జారీ చేసింది. కర్ర రాజశేఖర్ చైర్మన్ గా ఉన్న కరీంనగర్ అర్బన్ బ్యాంకు పాలకవర్గాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా ఉత్తర్వులతో పాలకవర్గం షాక్ కు గురయిం ది.ఓటర్ జాబితాలో గందరగోళం ఉందని, నిబంధనలకు విరుద్ధంగా ఉందని, ఎన్నికల ప్రక్రియలో జరిగిన లోపాలపై వారం రోజులలో వివరాలు ఇవ్వాలని జిల్లా కోపరేటివ్ అ ధికారిని, ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఎన్నికలకు ముందున్న పర్సన్ ఇ న్చార్జి కమిటి రోజు వారి పక్రియ నిర్వహించాలని అయితే ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శక లోపించిందని భావిస్తున్న ట్రిబ్యునల్ నామినేషన్ పత్రాలు, ఓటర్ జాబితా, బ్యాలెట్ పత్రాలు వంటి ఎన్నికల రికార్డులు అన్ని భద్రపరచాలని సూచించింది.






